చాలా మంది హెయిర్ స్టైల్ విషయంలో ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉంటారు. డ్రెస్సింగ్ మొదలు హెయిర్ స్టైల్ వరకు పురుషులు ఎన్నో మార్పులు చేస్తూ ఉంటారు. గడ్డం స్టైల్ చేయించుకోవడం, మంచిగా హెయిర్ ని ఉంచుకోవడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే జుట్టుని సెట్ చేసుకోవడానికి చాలా మంది పురుషులు హెయిర్ జెల్ (Hair Gel) ని వాడతారు.
ముఖ్యంగా ఏవైనా ఫంక్షన్స్ వున్నా లేదు అంటే ముఖ్యమైన సందర్భాలు వచ్చినా హైలైట్ గా కనిపించడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి హెయిర్ జెల్స్ ని ఉపయోగించడం వల్ల జుట్టు బాగానే ఉంటుంది అనుకుంటే పొరపాటు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మరి వాటి కోసం ఇప్పుడే చూసేద్దాం.
చుండ్రు సమస్యలు:
ఈ హెయిర్ జెల్ ని వాడడం వల్ల జుట్టు సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ గా దీనిని వాడడం వల్ల సెబమ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దీని కారణంగా జుట్టు పై చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే చుండ్రుకి దారి తీస్తుంది.
జుట్టును డ్యామేజ్ చేస్తుంది:
హెయిర్ జెల్ ని ఉపయోగించడం వల్ల మాయిశ్చర్ ఉండదు. దీని కారణంగా జుట్టు పొడిబారిపోవడం, పల్చగా అయిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. దీని కారణంగా జుట్టు డ్యామేజ్ అయిపోతుంది.
జుట్టు ఊడిపోవడం:
జల్ వాడడం వల్ల జుట్టు డీహైడ్రేట్ అయిపోతుంది మరియు డల్ గా అయిపోతుంది. రెగ్యులర్ గా దీనిని ఉపయోగించడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
రంగు మారిపోవడం:
ఎక్కువ హెయిర్ జెల్ వాడే వాళ్ళ జుట్టు రంగు మారిపోతుంది. దీనిలో ఉండే కెమికల్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి దీని నుండి దూరంగా ఉండడం మంచిది లేదు అంటే ఇటువంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.