సహజత్వానికి కేరాఫ్ నాని.. నేచురల్ స్టార్ సినీ జర్నీలో మలుపులు ఇవే..

-

తెలుగు చిత్ర సీమలో ‘స్వయంకృషి’తో ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా స్టార్ గా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన తర్వాత ఆయన చూపిన బాటలో మాస్ మహారాజ రవితేజ వచ్చాడు. అలా వచ్చిన మరో హీరో నేచురల్ స్టార్ నాని. ఆర్జే గా తన కెరీర్ స్టార్ట్ చేసిన నాని.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత ‘అష్టా చమ్మా’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.

నేచురల్ స్టార్ నాని ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన కెరీర్ లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న టైమ్ లో నానిని చూసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. తన సినిమా ‘అష్టా చమ్మా’లో హీరోగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2008న విడుదలైంది. అలా ఈ సినిమా విడుదలై 14 ఏళ్లు అవుతోంది.

అలా ఈ సినిమా ఇండస్ట్రీకి నాని వచ్చి ఇన్నేళ్లు అయిన సందర్భంగా పలువురు కు నానికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ‘అష్టా చమ్మా’లో హీరోయిన్ గా ‘కలర్స్’ స్వాతి నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత నాని నటించిన సినిమాలన్నీ కూడా బాగానే ఆడాయి. నేచురల్ స్టార్ నాని నటనను చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సహజంగా నటిస్తున్న నానిని చూసి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు.

nani natural star bheemili title 2

‘రైడ్’, ‘భీమిలి..కబడ్డీ జట్టు’..‘అలా మొదలైంది’, ‘పిల్ల జమీందార్’..వంటి చిత్రాలతో నానికి మంచి పేరు వచ్చింది. ఇక ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ ఫిల్మ్ తో నాని ఫుల్ ఫేమస్ అయిపోయారు.

 


ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో మళ్లీ నాని ఫామ్ లోకి వచ్చాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమ‌గాధ’ తర్వాత నాని వరుసగా ఎనిమిది సినిమాలు విజయం సాధించడం విశేషం.

‘జెంటిల్ మ‌న్’, ‘మ‌జ్ను’, ‘నేను లోక‌ల్’, ‘నిన్ను కోరి’, ‘ఎంసీఏ’ ఫిల్మ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల ‘అంటే సుందరానికి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నేచురల్ స్టార్ ..ప్రజెంట్ ‘దసరా’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ‘మహానటి’ కీర్తిసురేశ్ నటించింది. వచ్చే ఏడాది మార్చి 30న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version