తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీలలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటని చెప్పవచ్చు. నిర్మాణరంగంలో దూసుకుపోతూ ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. స్వర్గీయ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా వ్యవహరించగా ఆయన తదనంతరం ఆయన వారసుడు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూ ఇప్పుడు కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా సురేష్ బాబు కొడుకులైన దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దగ్గుబాటి రానా పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతుంటే అభిరామ్ మాత్రం ఒక్క సినిమాతో వచ్చి ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దగ్గుబాటి అభిరామ్.. సినిమాలకంటే శ్రీరెడ్డి తో ఎఫైర్ విషయంలోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన అందరికీ సుపరిచితుడుగా మారాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా తాజాగా అభిరామ్ పెళ్లికి సిద్ధమయ్యాడు అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని , ఇక ఆయన చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు అంటూ కథనాలు వెలబడుతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అభిరామ్ పెళ్ళి ఈ ఏడాది శ్రీలంకలో జరగబోతుందని తెలుస్తోంది. ఇక దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి అంటే ఈ వార్త అభిమానులకు ఏ స్థాయిలో సంతోషాన్ని కలిగిస్తుందో అందరికీ తెలిసిందే. ఇక వధువు ఎవరు అనే విషయానికి వస్తే దగ్గుబాటి చెల్లెలు కూతురుతో అభిరామ్ తన జీవితాన్ని పంచుకోబోతున్నారట. ఇక వధువు కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. వధువు కుటుంబం కారంచేడులో నివసిస్తోందని.. ఉన్నత చదువులు ఆమె చదివిందని సమాచారం. ఇక ఈ పెళ్లితో రామానాయుడు కోరిక కూడా తీరబోతోందట .అంతేకాదు వధువు కుటుంబానికి పొలాలతో పాటు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయని డిసెంబర్ 6వ తేదీన వీరి పెళ్లి జరగబోతుందని ,ఇక రామానాయుడు నివసించిన పాత ఇల్లు, డిజైన్లు శుభలేఖలపై అచ్చేయిస్తున్నారని సమాచారం.