‘మేము ఆగము అసలు ఆగము’ అంటున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్..

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ చిత్ర సీక్వెల్ ‘పుష్ప-2’ షూటింగ్ ఇవాళ స్టార్ట్ అయింది. అయితే, ఈ కార్యక్రమంలో బన్నీ పాల్గొనలేకపోయాడు. ఈ సంగతి పక్కనబెడితే అల్లు అర్జున్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో బన్నీ స్టైలిష్ స్టెప్స్ ఆడియన్స్ ను అలరిస్తున్నాయి.

అల్లు అర్జున్ డ్యాన్స్ చేసిన ఈ సాంగ్ సినిమాలోనిది కాదండోయ్.. ‘‘కోకా కోలా’’ బ్రాండ్ కోసం ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ పాడిన పాట..కాగా, గతంలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్ట బొమ్మ’ పాట పాడారు. ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన మరో సాంగ్ ‘మేము ఆగము’.

‘మే ము ఆగము..అసలు ఆగము’ అంటూ సాగే ఈ సాంగ్ ను ఎల్లీ కంపోజ్ చేశారు. ఇందులో పాపులర్ సౌత్ కొరియన్ గర్ల్ ట్రిబె కనిపించింది. బన్నీ ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.రెడ్ కలర్ సూట్ లో బన్నీ స్టైలిష్ లుక్ లో కనిపించాడు. బీట్ కు తగ్గట్లు స్టైలిష్ స్టెప్స్ వేసి.. సరికొత్తగా కనిపించాడు బన్నీ. మరో వైపున ‘పుష్ప-2’ కోసం పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలో బన్నీ ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news