మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ‘అవతార్‌ 3’ రిలీజ్‌ డేట్ ఔట్

-

జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘అవతార్’. ఈ సినిమాకు భాషలకతీతంగా ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పటికే రెండు భాగాల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మైమరిపించింది. వసూళ్లలోనూ వండర్స్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రబృందం పార్ట్-3పై కీలక అప్డేట్ ఇచ్చింది. మూడో భాగం టైటిల్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించింది.

‘అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌’ పేరుతో దీన్ని తెరకెక్కించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మరోసారి పండోర గ్రహానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అని అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ 19న ఇది విడుదల కానున్నట్లు తెలిపారు.  ‘అవతార్‌’ , ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో జేమ్స్ కామెరూన్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version