బ్యూటీ స్పీక్స్ : ఆచార్య స్పీక్స్ వెల్

ప‌లికే ప్ర‌తి మాట‌లో ఆత్మ సౌంద‌ర్యం ఉంటుంది..అర్థ సౌంద‌ర్యం కూడా ఉంటుంది. అందుకే ఇవాళ్టి బ్యూటీ స్పీక్స్.. మ‌న ఆచార్య సినిమా గురించి..ముఖ్యంగా కొర‌టాల శివ గురించి.. ఇంకా చెప్పాలంటే ఆయ‌న సినిమాల్లో కొన్ని అర్థవంతం అయిన మాట‌ల ప‌రంప‌ర గురించి.. చ‌ద‌వండిక !

నాలుగు సినిమాలు మాట్లాడాయి. అస‌లు మిర్చి క‌న్నా శ్రీ‌మంతుడు బాగున్నాడు. జ‌న‌తా గ్యారేజ్ క‌న్నా భ‌ర‌త్ అనే నేను ఇంకా బాగున్నాడు. అవును ! ఆయ‌న చెప్పాల‌నుకున్న పాయింట్ శ్రీ‌మంతుడు సినిమాలో చాలా బాగుంది. మిర్చి లో బాగున్నా మాస్ ఎలిమెంట్స్  ఎలివేష‌న్స్ ఇవి కూడా కొంత మింగేశాయి. ఒకింత అస‌హ‌నంకు గురిచేశాయి.అయినా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఆ సినిమా ఆక‌ట్టుకుంది. వాళ్ల‌కు కావాల్సింది ఇస్తూ.. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది మ‌హా అయితే తిరిగి ప్రేమిస్తారు అన్న డైలాగ్ ఇంకా ఎక్కువ న‌చ్చింది వాళ్ల‌కు. సినిమా లో అండ‌ర్ ప్లే చేసిన కంటెంట్ ఇదే ! ఈ ఒక్క సింగిల్ లైనర్ తో కొర‌టాల‌ను ప్రేమిస్తాం.

ఆయ‌న‌లో శివుడ్ని ఆరాధిస్తాం. ప్రేమ‌ను పంచే శివుడు ఆయ‌న. ఆ విధంగా ఆయ‌న ఎంత‌గానో న‌చ్చారు ఆ ఒక్క డైలాగ్ తో ! బృందావ‌నం ఆయ‌న డైరెక్ట్ చేయ‌లేదు కానీ ఆయ‌న ఫ్లేవ‌ర్ ఆయ‌న మార్క్ ఉన్న డైలాగులు చాలా న‌చ్చాయి తార‌క్ అభిమానులకు. అవ‌న్నీ కొర‌టాల శివ రాసిన‌వే ! ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ఏదేమ‌యినా కంటెంట్ ఉన్నోడికి క‌టౌట్ తో ప‌నేంటి డ్యూడ్ అని డైరెక్ట‌ర్ అయ్యాక మిర్చి సినిమా కోసం రాసిన లోప‌ల ఒరిజిన‌ల్ మాత్రం అలానే ఉంది అని బృందావ‌నం కోసం రాసినా ఆయ‌న చాలా స్పెష‌ల్.

ఆ త‌రువాత రెండు సినిమాలు ఒక‌టి శ్రీ‌మంతుడు ఆయ‌న స్థాయిని పెంచింది. ఊరిని ద‌త్త‌త తీసుకునేందుకు ఎంత‌టి గొప్ప మ‌న‌సు ఉండాలి. డ‌బ్బుంటే కాదు మ‌న‌సుంటేనే మంచి ప‌నులు జ‌రిగితీరుతాయి. ఆయ‌నలో మాస్ మ‌ళ్లీ అలానే ఉన్నాడు..క‌నుక తోట‌లో ఇర‌గ‌దీశాడు విలన్ల‌ను.. ఊరిని ద‌త్త‌త తీసుకోవ‌డం అంటే రంగులు రోడ్లూ వేసి వెళ్లిపోవ‌డం కాదు నిన్నూ నిన్నూ అంటూ ఒక్కొక్క‌రినీ చూపిస్తూ అంద‌రినీ ద‌త్త‌త తీసుకున్నాడు.. వారి బాగు కోసం ప‌రిశ్ర‌మించాడు. వెరీ రొటీన్ ఎండింగ్ ఆ సినిమాకు ఇచ్చాడు. ఇదొక్క‌టే విమ‌ర్శ కానీ డైలాగ్ ఎంత బాగుంది. కొర‌టాల వారింటి శివ‌య్య‌ను మ‌రోసారి ప్రేమిస్తాం.

బాధ్య‌త ఉండ‌క్క‌ర్ల..భ‌ర‌త్ అను నేను హామీ ఇస్తున్నాను అని అన్నాడు..చెప్పాడు..చెప్పించాడు.. వి ద పీపుల్ ఎందుకు ?ఫ‌ర్ ద పీపుల్ ఎందుకు ? ఆఫ్ ద పీపుల్ ఎందుకు ? ఎవ‌రి కోసం ఈ వ్య‌వ‌స్థ అంతా న‌డుస్తోంది ఎందుకీ ఆరాటం ఇవ‌న్నీ చెప్పారు. ఓ యువ ముఖ్య‌మంత్రి అనుకుంటే ఏమ‌యినా చేయ‌గ‌ల‌డు.. ఈ క‌థ‌కు ఒకేఒక్క‌డు సినిమాతో పోలిక ఉంది.ఉండ‌నీయండి ఏం కాదు. శ్రీ‌మంతుడు క‌థ‌కు అప్పుడెప్పుడో బాల‌య్య న‌టించిన ఓ సినిమాతో పోలిక ఉంది.  ఉండ‌నీయండి ఏం కాదు. ఇప్పుడు ఆచార్య క‌థ‌కూ ఏదో ఒక సినిమాతో నో ఏదో ఒక న‌వ‌ల‌తోనో పోలిక కానీ సంబంధం కానీ ఉండే ఉంటుంది. ఉండ‌నీయండి కానీ ఆయ‌న హీరో చేసే వ‌యొలెన్స్ కూడా స్టైలిష్ గానే ఉంటుంది. డైలాగ్  ఎంత బాగుంటుందో స్టంట్ కూడా అంతే అర్థ‌వంతంగా ఉంటుంది. ఆ విధంగా ఆచార్య కూడా అదే కోవ .. ఆచార్య ది కూడా అదే తోవ ! హ‌డావుడి ఉండ‌దు.. విడుద‌లకు ముందు మా సినిమా అద్భుతం ఆహా అని  చెప్ప‌డం అన్న‌ది ఉండే ఉండ‌దు..ఆయ‌న త‌న ప‌ని తాను చేసుకుని వెళ్లే తీరులోఎంద‌రికో న‌చ్చుతారు..  మాట‌లు కాదు చేత‌లు కావాలి అవే నిరూప‌ణ‌కు నోచుకోవాలి అని కూడా చెప్ప‌క‌నే చెప్పి ఇంప్రెస్ చేస్తారు.

క‌థ‌లో ద‌మ్ముంటే చాలు ఏ ఓవ‌ర్ యాక్ష‌న్లూ చేయ‌క్క‌ర్లేదు.. ఇదీ రామ్ చ‌ర‌ణ్ చెబుతున్న మాట. కొర‌టాల శివ క‌థ‌లోనే చాలా ద‌మ్ముంది. ఆయ‌న హీరోలు మ‌రీ అంత హ‌డావుడి చేయ‌రు. ఆయ‌న హీరో లోప‌ల ఒక  బుద్ధుడు, ఒక వివేకానందుడు ఉంటారు..ఆ విధంగానే వాళ్లు ప్ర‌వ‌ర్తిస్తారు. ఎంతో హుందాగా ప్ర‌వ‌ర్తిస్తారు. ఇది కూడా రాంచ‌ర‌ణ్ మాటే ! ఆయ‌న క‌థ‌ల్లో ఉన్న బ‌లం కార‌ణంగా సినిమాలు ఇంత‌కాలం ఇంత మంచి పేరు తెచ్చుకున్నాయి.. అని కూడా అంటున్నారాయ‌న. ఓ రైట‌ర్ గురించి ఇంత గొప్ప‌గా ఎవ‌రు అర్థం చేసుకుని త‌న అభిమానుల‌కు అర్థం అయ్యేలా చెప్ప‌గ‌ల‌రు.? ద‌టీజ్ కొర‌టాల ద‌టీజ్ రాం చ‌ర‌ణ్ కూడా !

– బ్యూటీ స్పీక్స్ – మ‌న‌లోకం ప్ర‌త్యేకం