Ram Charan: రామ్ చరణ్ లైనప్ క్రేజీ..లోకేశ్ కనక్ రాజ్‌తో నెక్స్ట్ ఫిల్మ్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన నెక్స్ట్ ఫిల్మ్ RC15పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్ డేట్స్ మేకర్స్ త్వరలో ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నెక్స్ట్ ఫిల్మ్ పైన సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్..ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నదని తెలుస్తోంది. కాగా, తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం..యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఫిల్మ్ ఉంటుంది.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ‘ఖైదీ, మాస్టర్, విక్రమ్’ చిత్రాల దర్శకుడు అయిన లోకేశ్ కనకరాజ్ నెక్స్ట్ ఫిల్మ్ డెఫినెట్ గా రామ్ చరణ్ తో చేస్తానని చెప్పేశారు. ప్రజెంట్ లోకేశ్..కమల్ హాసన్ ‘విక్రమ్’ పైనే ఫోకస్ పెట్టేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే రామ్ చరణ్ తో ఫిల్మ్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news