బాలయ్య ‘నరసింహ నాయుడు’ చిత్ర కథ ఎలా పుట్టిందో తెలుసా.. ఆసక్తికర విషయాలు!!

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘నరసింహ నాయుడు’..ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ చిత్రం ఇప్పటికీ టీవీల్లో వస్తే చాలు..జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జనాలు అంతగా ఈ మూవీని ఆదరించారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ పిక్చర్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కాలంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. కాగా ఈ ఫిల్మ్ స్టోరి రచనకు కారణమైన సంఘటన ఏంటనే విషయమై స్పెషల్ ఫోకస్…

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మేడికొండ మురళీ కృష్ణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగా బీ.గోపాల్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలోని పంచ్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాలయ్య చెప్పే డైలాగ్స్ విని నందమూరి అభిమానులు ఫిదా అయిపోయారు. పరచూరి బ్రదర్స్ ఈ డైలాగ్స్ రాయగా, జనాల నుంచి చక్కటి స్పందన వచ్చింది.

‘నరసింహ నాయుడు’ మూవీ స్టోరి వాస్తవిక సంఘటన ఆధారంగా రాసినట్లు రచయిత చిన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బిహార్ లో ఓ గ్రామంలో ఎవరైనా తమపైన దాడి చేయడానికి వస్తే కనుక వారిని ఎదుర్కొనేందుకు అక్కడి ప్రతీ ఇంట్లో నుంచి ఒక మగ పిల్లవాడిని ఇస్తారట.

అలా ఆ కాన్సెప్ట్ ను తీసుకుని మూడు రోజుల్లే ‘నరసింహ నాయుడు’ మూవీ స్టోరిని రాసినట్లు చిన్ని కృష్ణ వివరించారు. అలా వాస్తవిక సంఘటనను ఆధారం చేసుకుని రాయబడిన ఈ స్టోరి తో తీసిన ‘నరసింహ నాయుడు’ సినిమా..బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. ఇందులో బాలయ్యకు జోడీగా సిమ్రాన్ నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news