శ్రీదేవి విషయంలో ఆ సెంటిమెంట్ ఉండబోదన్న ఎన్టీఆర్.. తర్వాత ఏం జరిగిందంటే?

-

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. సాంఘీక, జానపద, పౌరాణిక సినిమాలు చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఎన్టీఆర్..తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన సంగతి అందరికీ విదితమే. ఇక ఆయన సినిమాలు విడుదలయ్యాయంటే చాలు..జనాలు ఎగబడి చూసేసేవారు.

ఆయనతో సినిమా చేయాలని దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్స్ కూడా వేచి చూసేవారు. ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తే తమకు మంచి పేరు వస్తుందని అనుకునే వారు. ఎన్టీఆర్., దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబో సెట్ అయిన రోజులవి. ఆ సినిమా పేరు ‘వేటగాడు’. కాగా, ఇందులో హీరోయిన్ గా ఎవరనే విషయమై కొద్ది రోజులు చర్చ జరిగిందట.

ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఎవరు నటిస్తే బాగుంటుందని మేకర్స్ చర్చించుకుంటున్నారు. శ్రీదేవి అయితే బాగుంటుందని దర్శకుడు రాఘవేంద్రరావు ఫిక్స్ అయ్యారు. కానీ, నిర్మాతలు మాత్రం భయపడిపోయారట. ఎందుకంటే శ్రీదేవి ఎన్టీఆర్ పక్కన మరీ చిన్న పిల్లలాగా కనబడుతుందని అనుకున్నారు. ఈ విషయం ఎన్టీఆర్ కు తెలిసింది. దాంతో ఆయనే స్వయంగా నిర్మాతలను పిలిపించారు.

సినిమాల్లో నటించే క్రమంలో సెంటిమెంట్ లు ఉండొద్దని, శ్రీదేవి విషయంలో అలా ఆలోచించొద్దని చెప్పారు. ప్రేక్షకులు దేవుళ్లని వాళ్లకు సరియైన కథ చెప్తే చాలు.. సినిమా సూపర్ హిట్ అవుతుందని ఎన్టీఆర్ చెప్పారు. కథ బలంగా ఉండేలా ప్లాన్ చేయాలని చెప్పారు. శ్రీదేవిని కూడా ఎన్టీఆర్ యే స్వయంగా హీరోయిన్ గా నటించాలని చెప్పారు. అలా ఆ తర్వాత వారిరువురు జంటగా పలు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్-శ్రీదేవి జంటగా వెండితెరపైన కనబడగానే జనాలు ఫిదా అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news