క్యాప్ లేకుంటే కష్టమేనా.. అందుకే ‘సీతారామం’ ఈవెంట్‌కు అలా వచ్చిన ప్రభాస్..!?

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్..‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన సినిమాల కోసం దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ గత చిత్రం ‘రాధేశ్యామ్’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా, ఆయన నెక్స్ట్ ఫిల్మ్స్ మాత్రం డెఫినెట్ గా ప్రేక్షకులను అలరిస్తాయని అభిమానులు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.

- Advertisement -

ఈ సంగతులు పక్కనబెడితే..ప్రభాస్ ఇటీవల ‘సీతారామం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చి మూవీ యూనిట్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. థియేటర్ అనేది గుడిలాంటిదని, ఇంట్లో దేవుడి గది ఉన్నప్పటికీ గుడికి వెళ్లినట్లు , థియేటర్ కు వెళ్లి మూవీ చూడాలని ప్రేక్షకులను ప్రభాస్ కోరారు. సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ టాకీసులోనే బాగుంటుందని చెప్పారు. కాగా, ప్రభాస్ ఇచ్చిన స్పీచ్ అభిమానులకు బాగా నచ్చింది.

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ క్యాప్ ధరించి రావడం గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రభాస్ అసలు క్యాప్ లేకుండా బయటకు రావడం కష్టమేనా? అని అనుకుంటున్నారు. వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్..బయటకు వచ్చినపుడు తన జుట్టు చూపించడానికి భయపడుతున్నాడా? అని చర్చించుకుంటున్నారు.

సాధారణంగా బయట ఎప్పుడూ క్యాప్ పెట్టుకోవడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వబోని ప్రభాస్..ఇప్పుడు అలా క్యాప్ పెట్టుకోవడానికి గల కారణాలేంటని నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో అడుగుతున్నారు.

బహుశా ప్రభాస్ కు బట్టతల రాబోతున్నదా? లేదా? ఏదైనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే బహుశా బట్టతల వచ్చి ఉండొచ్చని పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ప్యారలల్ గా ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీస్ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ పిక్చర్ చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...