టాలీవుడ్ బాద్ షా.. ఆ హీరోనే నెంబర్ వన్..!! లెక్క మారింది..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ నెంబర్ వన్ హీరో పొజిషన్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మరొకసారి నెంబర్ వన్ పొజిషన్ గురించి చర్చ జరుగుతూనే ఉన్నది. తాజాగా మే నెల సర్వే ఫలితాలను ప్రకటించిన ఒక మీడియా సంస్థ ఒక సర్వేలో ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా నిలిచారని తెలియజేసింది. మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ జాబితాలలో ప్రభాస్ మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. దీంతో ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు బిజీగా ఉన్న ప్రభాస్ ఈ రికార్డు దక్కించుకోవడం గమనార్హం.

ప్రభాస్ తరువాత స్థానంలో మహేష్ బాబు నిలిచారు గత నెలలో మహేష్ నటించిన సర్కార్ వారి పాట చిత్రం థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ అభిమానులు కూడా కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. RRR సినిమా విజయంతో ఎన్టీఆర్ మూడవ స్థానంలో నిలిచారు. ఇక అల్లు అర్జున్ నాలుగో జాబితాలో నిలబడగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. ఇక ఆర్ ఆర్ చిత్రంలో మరొక హీరో నటించిన రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో ఐదవ స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇక ఈ ఏడాది భీమ్లా నాయక చిత్రంతో ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచారు. ఇక నాని ఏడవ స్థానంలో నిలువగా విజయ్ దేవరకొండ 8వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇక చిరంజీవి తొమ్మిదవ స్థానంలో నిల‌వ‌గా రవితేజ మాత్రం 10వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక దీంతో తమ అభిమాన హీరోల జాబితాలను సైతం చూస్తున్నారు ప్రేక్షకులు.. ఇక మిగతా హీరోలు సైతం ఈ లిస్టులో లేకపోవడంతో చాలా మంది అభిమానులు కాస్త నిరుత్సాహ చెందినట్లుగా సమాచారం. ఏదిఏమైనా ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడంతో ఆయన అభిమానులు కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.