మల్లేశం హీరోయిన్.. మత్తెక్కిస్తోంది..

మల్లేశం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. రాజ్ ఆర్ దర్శకుడిగా రూపొందించిన ఈ చిత్రంలో కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపించగా హీరోయిన్ గా అచ్చమైన తెలుగమ్మాయి అనన్య నాగల్ల నటించింది. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఆమె కనబడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కళ్ళతో పలికించిన భావాలు బాగా ఆకర్షించాయి. తెలుగులో ఇంతమంచి హీరోయిన్లు ఉన్నారా అని చాలామంది ఆశ్చర్యపోయారు.

హీరోయిన్ గా మల్లేశం సినిమాతో పేరొచ్చిన తర్వాత ప్లే బ్యాక్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దర్శకుడు సినిమాతో దర్శకుడిగా మారిన హరిప్రసాద్ జక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మొన్నటికి మొన్న ఈ చిత్రబృందం గ్రీన్ ఇండియా ఛాలెంజిలో కనిపించింది. ఐతే హీరోయిన్ గా వచ్చే పాపులారిటీని నిలబెట్టుకోవాలంటే సోషల్ మీడియాలో ఫాలోవర్లని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రతీ హీరోయిన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది.

ఫోటోషూట్లతో అభిమానులతో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తూ ఉంటారు. అందుకే సోషల్ మీడియాని హీరోయిన్లు నిర్లక్ష్యం చేయరు. ఐతే తాజాగా అనన్య నాగల్ల ట్విట్టర్ లోకి అడుగుపెట్టింది. అడుగు పెట్టడమే ఆలస్యం అందమైన ఫోటోలని అభిమానులతో పంచుకుంది. మోడ్రన్ ఔట్ ఫిట్ లో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని, పెద్ద కళ్ళు అందులో నుండి ఏదో చెబుతున్నట్టుగా ఉన్నాయి.

ఒక పక్క సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ తనకి నచ్చిన పాత్రల్లో సినిమాలు చేసుకుంటూ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు నడుస్తున్న అనన్య నాగల్ల కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.