తెలుగు హీరోతో మృణాల్ ఠాకూర్ పెళ్లి ?

-

 

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను సీత గానే గుర్తుపెట్టుకున్నారు సీత గానే ఆరాధిస్తున్నారు. కానీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోందని చెప్పాలి. ఇది ఇలా ఉండగా.. నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ వేడుకలో చేసిన ఆసక్తికర వాక్యాలు నటి మృనాల్ ఠాకూర్ విషయంలో నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసాయి.

గతంలో ఓ హీరోయిన్ ను హైదరాబాద్ కు వచ్చేయమ్మ అని తాను దీవిస్తే తెలుగింటి కోడలు అవుతుందని… ఇప్పుడు మృణాల్ ను కూడా అలాగే దీవిస్తున్నానని అరవింద్ అన్నారు. దీంతో మృణాల్ ఎవరైనా తెలుగు హీరోతో ప్రేమలో ఉన్నారా అంటూ నెటిజన్ల నుంచి ఆసక్తి వ్యక్తం అవుతోంది. కాగా, ఇందులో విజయ్​ సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్​ నటిస్తున్నారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న తాజాగా సినిమా ​ ‘ఫ్యామిలీ స్టార్‌’. ఇక ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version