మహేశ్ బాబు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘అతడు’కు సీక్వెల్.. మురళీమోహన్ కామెంట్స్ ఇవే..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘అతడు’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ కాంబోలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. కాగా, ఇప్పటికీ ఈ మూవీ టీవీల్లో వస్తే చాలు..జనాలు ఎగబడి మరీ చూస్తుంటారు. అలా కల్ట్ సినిమాగా ‘అతడు’ నిలిచిపోయింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై ఎం.రామ్మోహన్, డి.కిషోర్ ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేశారు. మురళీ మోహన్ సంస్థ ప్రొడ్యూస్ చేసిన ఈ పిక్చర్..భారీ వసూళ్లు చేసింది. కాగా, ఈ సినిమా సీక్వెల్ పైన ప్రొడ్యూసర్ గా మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మహేశ్ బాబు-త్రిష జంటగా నటించిన ఈ పిక్చర్ లో కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజు కీలక పాత్రలు పోషించారు. ఇక కామెడీ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీరియస్ మోడ్ లో ఉన్నట్లుగానే ఉంటూ..హ్యాపీగా ఈ సినిమా కొనసాగుతుంది. సునీల్, మహేశ్ బాబు మధ్య ఉండే సీన్స్ కూడా ఫిల్మ్ కు హైలైట్ గా నిలుస్తాయి.

ఈ క్రమంలోనే ‘అతడు’ సినిమాకు సీక్వెల్ ‘అతడు-2’ ఉంటుందా? అని ఇంటర్వ్యూలో యాంకర్ మురళీ మోహన్ ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ..చేస్తే బాగుంటుందని, అయితే, త్రివిక్రమ్, మహేశ్ ఇద్దరూ..ప్రజెంట్ ఫుల్ బిజీ పర్సన్స్ అని, వారిద్దరి కాంబినేషన్ లో మళ్లీ సినిమా అంటే జనాలు హ్యాపీగా ఫీలవుతారన్నారు. వారిద్దరూ డిసైడ్ అయితే కనుక తప్పక ఉంటుందని, చేయాలనే ఆలోచన తనకు ఉందని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news