RRR పిక్చర్ తో రామ్ చరణ్ కు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ బాగా పెరిగింది. ముఖ్యంగా నార్త్ ఇండియా ..హిందీ బెల్ట్ లో అయితే ఆడియన్స్ ‘రామరాజు’ పాత్ర పోషించిన రామ్ చరణ్ ను చూసి ఫిదా అయిపోయారు. RC 15 ఫిల్మ్ షూటింగ్ కోసం రామ్ చరణ్ నార్త్ ఇండియాకు వెళ్లగా, ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. అలా రామ్ చరణ్ RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.
అలా రామ్ చరణ్ నెక్స్ట్ ఫిల్మ్ కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. గతంలో బాలీవుడ్ ఫిల్మ్ ఒకటి రామ్ చరణ్ చేయగా, అది అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సారి స్ట్రెయిట్ హిందీ ఫిల్మ్ బాగుండాలని మేకర్స్ అనుకుంటున్నారు. ‘జంజీర్’ రీమేక్ అయిన ‘తూపాన్’లో రామ్ చరణ్ హీరోగా నటించగా, హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా నటించింది.
‘తూపాన్’ రిజల్ట్ అనుకున్న స్థాయిలో రాలేదు. కానీ, ఈ సారి మాత్రం హిందీ లో అదిరిపోయే స్టోరి లైన్స్ తో మేకర్స్ రామ్ చరణ్ కోసం రెడీగా ఉన్నారట. ఈ క్రమంలోనే మరామ్ చరణ్ బాలీవుడ్ ఫిల్మ్స్ రెండిటికీ సైన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో రానున్నాయని తెలుస్తోంది. స్టోరి లైన్ విన్న పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్.. హిందీ ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పేశారని వినికిడి. ప్రస్తుతం రామ్ చరణ్ ..ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో RC 15 పిక్చర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.