ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ ‘స్పై’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్​ రీసెంట్ మూవీ ‘స్పై’ జూన్ 29న థియేటర్లలో సందడి చేసింది. ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఐశ్వర్య మేనన్ కథానాయిక. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అనుకోలేక పోయింది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఎలాంటి చప్పుడు లేకుండా సడెన్​గా ఇవాళ్టి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా గురువారం నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదీ స్పై స్టోరీ : జైవర్ధన్ (నిఖిల్) రా ఏజెంట్. శ్రీలంకలో పనిచేస్తుంటాడు. భారతదేశంపై దాడి ప్రయత్నాల్లో ఉన్న ఉగ్రవాది ఖదీర్ ఖాన్ చనిపోయాడని అందరూ భావిస్తారు. కానీ అతడి నుంచి నష్టం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయాడనుకున్న ఖదీర్ కోసం ప్రత్యేకమైన మిషన్తో జై రంగంలోకి దిగుతాడు. మరి ఖదీర్ దొరికాడా? లేక అందరూ ఊహించినట్టుగానే చనిపోయాడా? ఈ ప్రయత్నంలో ఉన్న జై తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేశ్)ని చంపినవాళ్లని ఎలా కనుక్కున్నాడు? ఈ మిషన్కి ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ అదృశ్యం వెనకున్న రహస్యానికీ సంబంధం ఏమిటనేది మిగతా కథ.

Read more RELATED
Recommended to you

Exit mobile version