టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రతీ సినిమాలో సమాజానికి ఏదేని ఒక సందేశమిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో కమర్షియల్ ఎల్మెంట్స్ పైన ఫుల్ ఫోకస్ పెడుతుంటారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేయగా, ‘సిద్ధ’గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫుల్ లెంగ్త్ ప్లే చేశారు. ఈ పిక్చర్ ప్రమోషన్స్ లో హీరోలు, దర్శకుడు కొరటాల శివ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివను తన నెక్స్ట్ ఫిల్మ్ గురించి మీడియా వారు అడగగా, ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పేశారు దర్శకులు.
గతంలో తారక్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమా చేసిన కొరటాల శివ..ఈ సారి పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్టోరి రెడీ అయిపోయిందని చెప్పారు. ఈ సారి చాలా పెద్ద కథ రాసుకున్నానని, అది పొలిటికల్ స్టోరి కాదని క్లారిటీ ఇచ్చేశారు ‘ఆచార్య’ డైరెక్టర్. ఆ సినిమాలో ఓవర్ డోస్ ఆఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని, అది మాస్ సినిమా అని చెప్పారు. అందులో హైస్ ఇచ్చే క్యారెక్టరైజేషన్ ఉంటుందని స్పష్టం చేశారు.
చాలా పెద్ద కథతో ఈ సారి బోర్డర్స్ దాటేస్తామని కొరటాల శివ చెప్పారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. కొరటాల శివ మాటలకు సంబంధించిన వీడియోలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో #NTR30 హ్యాష్ ట్యాగ్ ఎన్టీఆర్ 30 తో ట్వీట్స్ చేస్తున్నారు.
అలా సదరు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. తాను ‘జనతా గ్యారేజ్’ సినిమా చేసేప్పుడే తారక్ తో చెప్పానని, మరో సినిమా డెఫినెట్ గా మాస్ గా ఉంటుందని అన్నానని కొరటాల శివ చెప్పారు. ‘ఆచార్య’ విడుదల తర్వాత. కొంత కాలం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఆ సినిమాపై ఫోకస్ చేస్తానని చెప్పుకొచ్చారు కొరటాల.
Same Energy 😀🔥#NTR30 #NTRKoratalaSiva2 pic.twitter.com/uVVVpwwAKh
— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart) April 26, 2022
biggest scripts 💥, @tarak9999 #NTR30 pic.twitter.com/qJZkWhUe4r
— NTR Cult ™ (@NTRcultOfficial) April 25, 2022
One of The Biggest Emotional Graphs i have written coz i got one kind of Live Wire In My Hand – That is @tarak9999
🌋Siva Koratala Garu about #NTR30 story line💉 pic.twitter.com/fAYYQCMh73
— WORLD NTR FANS (@worldNTRfans) April 26, 2022