Rakul Preet Singh : ట్రెండీ సూట్ లో రకుల్ క్యూట్ పోజులు

-

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.  సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్​తో కనిపించి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో కాస్త జోరు తగ్గించినా హిందీలో మాత్రం ఫుల్​ బిజీగా గడుపుతోంది.
ఇప్పటికే హిందీలో అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది. తాజాగా ఛత్రివాలీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నే రకుల్ బిజీబిజీగా ఉంది.
అలాగే ఫిట్​నెస్​కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందీ అమ్మడు. ఎంత బిజీగా ఉన్నా రోజుకు ఓ గంటైన జిమ్ లో కసరత్తులు చేస్తుంది. ఫిట్ నెస్ పై ఈ భామకు మక్కువ ఎక్కువ. అందుకే ఎఫ్45 పేరుతో జిమ్ కూడా ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version