ఆచార్య స్పీక్స్ నౌ : ఆ అయ్యకు కొడుకు ! అదరగొట్టాడ్రా !

-

సినిమా స్థాయిని పెంచే సినిమాలు రాజ‌మౌళి చేస్తారు. సినిమా క‌థ‌కు గౌర‌వం మ‌రియు బాధ్య‌త పెంచే ప‌నులు కొర‌టాల శివ లాంటి వారు చేస్తారు. నో డౌట్ ఇన్ ఇట్ . ఒక‌వేళ ఆయ‌న అంచ‌నాలు త‌ప్పినా కూడా మంచి క‌థ‌తోనే మ‌ళ్లీ మ‌ళ్లీ త‌న ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు కానీ ఫ‌క్తు ఫార్ములాల‌ను న‌మ్ముకోరు. ఆవిధంగా కొర‌టాల శివ మ‌ళ్లీ ప్ర‌య‌త్నిస్తే మ‌రో శ్రీమంతుడు తీయ‌గ‌ల‌డు.. మ‌రో ఆచార్య మాత్రం వ‌ద్దు అని అంటోంది విశ్లేష‌క వ‌ర్గం. కానీ ఈ సినిమాతో చ‌ర‌ణ్ స్థాయి పెరిగింది.పాత్ర ప‌రిధి చిరుది, పాత్ర విస్తృతి చ‌ర‌ణ్ ది.. ఆ మేర‌కు ఆ ఇద్ద‌రూ రాణించారు. గెలిచారు అభిమానుల మ‌న‌సుల‌ను. త‌ప్పిదాలు కోసం త‌రువాత మాట్లాడ‌దాం.

సినిమా సినిమాకూ వైవిధ్యం చూపించే చిరు ఈ సారి కూడా ఓ వైవిధ్య భ‌రితం అయిన క‌థ‌నే ఎంచుకున్నారు. త‌న‌దైన స్టైల్ ఎక్క‌డికీ పోలేద‌ని నిరూపించుకున్నారు. అర‌వై ఏళ్లు దాటినా కూడా ఈజ్ ఎక్క‌డికీ పోలేద‌ని ప‌దే ప‌దే త‌న న‌ట‌న‌తో డ్రాన్స్ తో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఇంప్రూవ్ అవుతూనే ఉన్నారు. ఆయ‌న చెప్పిన విధంగానే బాగుండ‌డం అన్న ప‌దానికి ఎండింగ్ అన్న‌ది లేదు. క‌నుక ఎప్ప‌టిలానే కంటెంట్ అన్న‌ది క‌థానాయ‌కుడి క‌న్నా చాలా ముఖ్యం అని అంటున్నారాయ‌న. ఆ విధంగా ఆచార్య సినిమా ఆయ‌న నాలుగేళ్ల క‌ష్టం. చిత్ర బృందం మొత్తం ఎంతో శ్ర‌మించి చేసిన సినిమా. బ‌డ్జెట్ ప‌రంగా ఎన్నో అవ‌రోధాలు.. వడ్డీల‌కే డ‌బ్బులు చెల్లించ‌లేక ప‌డిన అవ‌స్థ‌లు.. వీట‌న్నింట‌నీ దాటుకుని ఈ సినిమా ఈ శుక్ర‌వారం (ఏప్రిల్ 29,2022) వ‌చ్చేసింది.

మెగా మాస్ మానియాను సృష్టించేందుకు !

మొద‌ట్నుంచి సామాజిక బాధ్య‌త ఉన్న క‌థ‌లు ఎంచుకోవ‌డం.. వాటికి అనుగుణంగా త‌నదైన ట్రీట్మెంట్ ను జోడించడం కొర‌టాల శివ‌కు తెలిసిన విద్య. ఆ విధంగా ఆయ‌న‌కు పెన్నుతో పెట్టిన విద్య. ఈ సారి కూడా కొర‌టాల శివ ఓ మంచి నేప‌థ్యాన్నే ఎంచుకున్నారు కానీ ఎందుక‌నో అది ఇంకాస్త ఎలివేట్ కావాల్సి ఉన్నా కాలేక‌పోయింద‌న్న డివైడ్ టాక్ న‌డుస్తోంది. సినిమా ఎలా ఉన్నా చిరు ఎంట్రీ. రామ్ చ‌ర‌ణ్ ఎప్పీరియెన్స్, డైలాగ్ డెలివ‌రీ, చ‌ర‌ణ్ లుక్స్ ఇవ‌న్నీ కూడా క‌ట్టిప‌డేస్తాయి అని ఇంకొంద‌రు మెగా అభిమానులు అంటున్న అభిప్రాయం. లేదా వెల్ల‌డి చేస్తున్న అభిప్రాయం.

సినిమా ప్ర‌మోష‌న్ల‌లో చెప్పిన విధంగానే చెర్రీ పాత్ర గొప్ప‌గా ఉంది. ఉంటుంది కూడా ! ఆ స్థాయి న‌ట‌న‌ను కూడా ఆయ‌న క‌న‌బ‌రిచారు. ఎదురుగా మెగాస్టార్ ఉన్నా కూడా త‌న ప్ర‌తిభ‌ను చూపించేందుకు అవ‌కాశం ఉన్న చోట తానేంటో నిరూపించుకునేందుకు వెన‌క‌డుగు వేయ‌లేదు. తండ్రి మాదిరిగానే కొడుకు కష్ట‌ప‌డ‌డంలో ఎన్న‌డూ వెనుకంజ వేయలేదు కూడా ! ట్రిపుల్ ఆర్ క‌న్నా మించిన సినిమా ఇది అవుతుంద‌ని ఆశించారు కానీ అవుతుందో లేదో అన్న‌ది ఇంకొద్ది గంట‌లు ఆగితే ఇంకొన్ని షోలు ప‌డితే కానీ తేల‌దు. క‌లెక్ష్‌న్ల డేటా వ‌ర‌కూ ఈ సినిమా సాధించాల్సింది 134 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను.. మ‌రి! సాధిస్తుందా.. సిద్ధా ప‌య‌నం ముందుకు విజ‌య తీరాల‌కు చేరుకుంటుందా అన్న‌ది ఇప్పుడిక చ‌ర్చ‌కు తావిచ్చే విష‌యాలు.

Read more RELATED
Recommended to you

Latest news