బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తను నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఆ ఫిల్మ్ ను ప్రజెంట్ చేస్తున్న దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి ఏపీలోని వైజాగ్ కు వచ్చారు రణ్ బీర్ కపూర్.
ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. ‘బ్రహ్మ్రాస్త్ర’ చిత్ర ట్రైలర్ జూన్ 15న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ గురించి రణ్ బీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు సౌత్ ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టమని, తను సౌత్ ఇండియన్ సినిమాల అభిమానినని తెలిపారు రణ్ బీర్ కపూర్. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి , పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.., ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. పవన్ కల్యాన్ స్వాగ్ అంటే చాలా చాలా ఇష్టమని తెలిపిన రణ్ బీర్ కపూర్..ఇంత మంది హీరోలు చాలా గొప్ప వారిని, ఇందులో ఒక్కరిని ఎంపిక చేసుకోవాలంటే తాను డార్లింగ్ ప్రభాస్ ను బెస్ట్ ఫ్రెండని చెప్తానని రణ్ బీర్ కపూర్ చెప్పుకొచ్చారు.
#Bollywood Superstar #RanbirKapoor is in the #Vizag City to promote his film #Brahmāstra and he just can't stop oozing out his love for Telugu stars 🤩
Watch Here: https://t.co/9hXL2nK3mh#SSRajamouli #RanbirKapoorInVizag #ShreyasMedia pic.twitter.com/7iUnxC1LhF
— Shreyas Media (@shreyasgroup) May 31, 2022