లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. ఇక సక్సెస్ కొట్టడమే తరువాయి..!

-

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి తన సినీ కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె బాలీవుడ్ సినిమాలతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడానికి పయనమయింది అని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఏకంగా షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వాస్తవానికి ఆయన పక్కన ఒక చిన్న ఫ్రేమ్ లో కనిపించినా చాలు అని ఫీల్ అయ్యే నటులు చాలామంది ఉంటారు. కానీ ఆ అవకాశం అందరి హీరోయిన్స్ కి అంత త్వరగా లభించదు.

అయితే నేషనల్ క్రష్ రష్మికకు మాత్రం ఈ అవకాశం చాలా త్వరగానే లభించింది అని చెప్పాలి. కన్నడ నుంచి వచ్చిన ఈమెకు ఎంట్రీ తోనే అమితాబ్ బచ్చన్ సినిమాలో ప్రధాన పాత్ర చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత రణబీర్ సింగ్ నటిస్తున్న యానిమల్ సినిమాలో కూడా హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించడంతో అందరూ ఈమె అదృష్టవంతురాలంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇకపోతే షారుక్ ఖాన్ తో కలిసి రష్మిక ఒక యాడ్ లో నటించగా ఇందుకు సంబంధించిన ఫోటో చాలా వైరల్ గా మారుతుంది .

ఈ ఫోటోలో షారుక్ లుక్స్ సూపర్ గా ఉన్నాయి.ఇక ఈ యాడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకొని తన క్రేజ్ ను మరింత పెంచుకుంది రష్మిక. ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే.. ఇటీవలే పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు జవాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఈ సినిమాతో షారుక్ ఖాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version