ట్రెండ్ ఇన్ : రీమేక్ బాటలో బాలీవుడ్..అక్షయ్ కుమార్ హీరోగా ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా..

-

ప్రజెంట్ రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. సౌత్ ఇండియన్ సూపర్ హిట్ ఫిల్మ్స్ ను బాలీవుడ్ రీమేక్ చేస్తోంది. అది కూడా ఒరిజినల్ డైరెక్టర్స్‌తోనే కావడం విశేషం. ఇటీవల కాలంలో అలా రీమేక్ అయి విడుదలైన చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజాగా మరో రీమేక్ ఫిల్మ్ షురూ అయింది.

నేషనల్ అవార్డు అందుకోవడంతో పాటు సినీ అభిమానులు, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘సురైరా పోట్రు’. సుధాకొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరిట విడుదలై ఘన విజయం సాధించింది.

ఈ పిక్చర్ ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సూర్య ప్రొడ్యూస్ చేస్తుండగా, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా రాధిక మదన్ నటిస్తోంది. ఈ సినిమాకూ ఒరిజినల్ డైరెక్టర్ సుధా కొంగరనే దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

ఒకప్పుడు బాలీవుడ్ ఫిల్మ్స్ ను సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ రీమేక్ చేసేవారు. కానీ, ఇప్పుడు బాలీవుడ్ వాళ్లు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ ను రీమేక్ చేస్తున్నారు. దాంతో దక్షిణ భారత సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నేషనల్ అవార్డు గెలుచుకున్న తెలుగు చిత్రం ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేశారు. ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్నది ఈ చిత్రం. దీనిని కూడా ఒరిజినల్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరియే డైరెక్ట్ చేశారు. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమానూ హిందీ రీమేక్ లో సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వి్ట్టర్ లో Remake అనే వర్డ్ ను నెటిజన్లు , సూర్య అభిమానులు ట్రెండ్ చేస్తు్న్నారు. అలా ఈ వర్డ్ కొద్ది సేపు ట్వి్ట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news