సమంతపై గ్రామీ అవార్డ్ విన్నర్ ఫైర్

-

టాలీవుడ్ హీరోయిన్ సమంత హెల్త్ టిప్స్ తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ఆరోగ్యం గురించి సామ్ ఇచ్చిన సలహా ప్రమాదకరమైనదంటూ ఇప్పటికే ప్రముఖులు, వైద్యులు కొందరు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే విషయమై గ్రామీ అవార్డు గ్రహీత, మ్యూజిక్ కంపోజర్‌ రికీ కేజ్‌ కూడా సమంతపై మండిపడ్డారు. ఇటీవల ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రికీ కేజ్ మాట్లాడుతూ.. ఒక సెలబ్రిటీ సూచించిన మెడికల్ ప్రొసీజర్ చాలా మందిపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.

“ఈ ప్రమాదకరమైన సూచనలు ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే అవకాశం ఉంది. ఇది మర్చిపోయి ఆమె పూర్తిగా బాధ్యత లేకుండా మాట్లాడి చాలా ప్రాణాలను రిస్క్లోకి నెడుతున్నారు. రెగ్యూలర్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రభావవంతంగా పనిచేయదనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారంతా ఇలాంటి మాటలు వింటే పెడదారిన పడే ప్రమాముంది. నన్ను అడిగితే ఆమె ఇలాంటి కామెంట్లు చేయడం తప్పు. పైగా ఆమె చేసిన కామెంట్లను వెనకేసుకురావడం ఇంకా పెద్ద తప్పు. వీటి వల్ల కేవలం ఆమె మాత్రమే కాదు ఆమె ఆరోగ్య సమస్యలను నయం చేసిన డాక్టర్లను కూడా కించపరచాల్సిన పరిస్థితి వచ్చింది ” అంటూ సమంతపై రిక్కీ తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version