Ram Charan: రామ్ చరణ్ RC 15 గురించి తమిళ్ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తు్న్నారు. ఈ పిక్చర్ నుంచి ఏదేని అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR ఫిల్మ్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. కాగా, ఇందులో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.

ఈ ఫిల్మ్ అఫీషియల్ అప్ డేట్స్ కోసం సినీ లవర్స్ సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తమిళ్ స్టార్ డైరెక్టర్ , యాక్టర్ ఎస్.జే.సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ స్టోరి అందించిన RC 15 పిక్చర్ లో తాను కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు ఎస్.జే.సూర్య తెలిపారు. ఇకపోతే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నదని స్పష్టం చేశారు.

ఎస్.జే.సూర్య ఇందులో విలన్ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే, ఈ విషయమై సూర్య ఎటువంటి స్పష్టతనివ్వలేదు. సీఎం కొడుకుగా రామ్ చరణ్ ఇందులో కనిపించబోతున్నాడని వినికిడి. గతంలో మహేశ్ బాబు ‘స్పైడర్’ చిత్రంలో విలన్ గా కనిపించిన ఎస్.జే.సూర్య..ఈ సారి RC 15 లో కూడా విలన్ రోల్ ప్లే చేస్తారా? అని నెటిజన్లు, సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ కు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తు్న్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news