హీరో, హీరోయిన్లకు సమాన రెమ్యునరేషన్ ఉండాలి : శృతిహాసన్

-

తెలుగు పరిశ్రమలో శ్రుతి హాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురు గా అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ సొంతంగా కష్టపడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతా ఇంతా కాదు.మిడిల్ ఏజ్ నుండి సీనియర్ హీరోల వరకు తానే మెయిన్ ఆప్షన్ గా ఉంది.ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య బాబు వీర సింహ రెడ్డి లో నటించి మెప్పించింది. ఆమె టాలెంట్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరస చూస్తే మనకు అర్ధం అవుతుంది.

అయితే.. తాజాగా ఫ్రాన్స్ లో జరుగుతున్న 76వ కేన్స్ చలన చిత్రోత్సవాల్లో హీరోయిన్ శృతి హాసన్ సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ పొందడానికి తనకు 20 ఏళ్లు పట్టిందన్న ప్రియాంక చోప్రా మాటలపై మీడియా ప్రశ్నించింది. దీనికి శృతి స్పందిస్తూ…’ప్రియాంక అద్భుతం చేశారు. మన దగ్గర కూడా హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా రెమ్యూనరేషన్ ఇచ్చే రోజు రావాలని ఎదురుచూస్తున్నా. మేము కూడా కష్టపడుతున్నాం’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version