సమంత బాటలో దీపికా పదుకొణె..షారుఖ్ ‘జవాన్’లో ఐటెం సాంగ్!!

-

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్..సినీ ప్రేక్షకులకు చివరగా ‘జీరో’ ఫిల్మ్ లో కనిపించారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతో ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ వరుస సినిమాల షూటింగ్స్ లో షారుఖ్ ..ఫుల్ బిజీగా ఉన్నాడు.

తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ చేస్తున్న ఫిల్మ్ ‘జవాన్’. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ నుంచి విడుదలైన ఫస్ట్ మోషన్ వీడియో, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టకుంటున్నాయి. వచ్చే ఏడాది జూన్ 2న ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా, ఇందులో బోలెడన్ని సర్ ప్రైజెస్ ను యంగ్ డైరెక్టర్ అట్లీ ప్లాన్ చేసినట్లు బీ టౌన్ సర్కిల్స్ టాక్.

ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం ఉంటుందని సమాచారం. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో కీలక పాత్ర పోషించగా, ఇందులో ఐటెం సాంగ్ కూడా ఉంటుందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ , రణ్ వీర్ సింగ్ వైఫ్ దీపికా పదుకొణె ఇందులో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వినికిడి.

మరో వైపున షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె ‘పఠాన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్..విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ‘డుంకి’ సినిమా చేయనున్నారు.

రెడ్ చిల్లి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ‘జవాన్’ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ముఖంపై కట్లతో అలా కూర్చొని…నవ్వుతూ ట్రైలర్ లో కనిపించారు షారుఖ్. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్ తో ‘పోలీసోడు’,‘విజిల్’తో పాటు ‘రాజా రాణి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసిన అట్లీ ప్రస్తుతం..షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ సినిమా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news