మహేశ్ ‘దూకుడు’లో శ్రీహరికి కీలక పాత్ర ఇచ్చిన శ్రీను వైట్ల.. తర్వాత ఏం జరిగిందంటే !!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘దూకుడు’. ఈ చిత్రం ఇప్పటికీ టీవీల్లో వస్తే చాలు..జనాలు టీవీలకు అతుక్కుపోయి మరీ చూసేస్తుంటారు. కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ లో మహేశ్ ఇరగదీసిన ఈ పిక్చర్..శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అయితే, ఈ చిత్రంలో ఓ పాత్రకు దర్శకుడు శ్రీను వైట్ల రియల్ స్టార్ శ్రీహరిని ఫిక్స్ చేశారు. కానీ, ఆ పాత్రలోకి తర్వాత ప్రకాశ్ రాజ్ వచ్చాడు.అలా జరగడం వెనుకున్న కథ తెలుసుకుందాం.

తెలంగాణ భాషను ఈ చిత్రంలో హీరో మహేశ్ బాబుకు బాడీ లాంగ్వేజ్ గా పెట్టాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఈ క్రమంలోనే తనకు ఎంతో ఇష్టమైన నటుడు, రియల్ స్టార్ శ్రీహరిని తొలుత మహేశ్ బాబు కు తండ్రిగా ఫిక్స్ అయ్యారట. ఈ స్టోరిని శ్రీహరికి వినిపించగా, తాను అప్పుడే తండ్రి పాత్ర పోషించబోనని శ్రీహరి చెప్పేశాడట. అయినప్పటికీ ఎలాగో అలాగా కన్విన్స్ చేయాలని వైట్ల శ్రీను ప్రయత్నించాడు. కానీ, శ్రీహరి ఆ పాత్ర చేయలేని చెప్పేశాడు.

ఈ విషయమై శ్రీను వైట్ల ఆలోచించారు. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ కు మహేశ్ తండ్రి పాత్ర ఇచ్చారు. అలా ఆ సినిమాలో శ్రీహరి పాత్ర ప్రకాశ్ రాజ్ వద్దకు వెళ్లింది. ఈ చిత్రం ఏడాది పాటు బాగా ఆడింది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసి..మహేశ్ కెరీర్ లోనే బెస్ట్ పిక్చర్ గా నిలిచింది.

Goodbye NTR-Dookudu Movie Review (Old wine in even more old Bottle) – mad about moviez.inమహేశ్ కామెడీ టైమింగ్ ప్లస్ బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు వంటి కమెడియన్స్ తో సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. మహేశ్ -సమంత లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. మొత్తంగా ‘దూకుడు’ సినిమా సూపర్ హిట్ అయింది. శ్రీను వైట్ల-మహేశ్ బాబు కాంబోలో వచ్చిన తొలి పిక్చర్ ‘దూకుడు’ కాగా, ఇది అభిమానుల అంచనాలను మించి ఉండటంతో హ్యాపీగా ఫీలయ్యారు ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news