విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలివే.. ఆ చిత్రానికి రాజమౌళి పోషించిన పాత్ర ఏంటంటే?

-

‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ రిలీజ్ అయి త్రీ డేస్ అయింది. అయినా ఇంకా ఆ చిత్ర మేనియా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మూవీ గురించి చర్చించుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సినిమాను అప్రిసియేట్ చేస్తు్న్నారు. మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడని కొనియాడుతున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటికీ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ స్టోరిలు అందిస్తారు. ఈ క్రమంలోనే విజయేంద్రప్రసాద్ సైతం తానే స్టోరి రాసుకుని మూడు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అయితే, అవి బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

vijayendraprasad
vijayendraprasad

విజయేంద్రప్రసాద్ స్టోరి రైటర్‌గా సక్సెస్ ఫుల్ అయినప్పటికీ డైరెక్టర్ గా మాత్రం అనుకున్న స్థాయిలో పేరు సంపాదించుకోలేకపోయారు. ‘ఘ‌రానా బుల్లోడు, స‌మ‌ర‌సింహారెడ్డి’ చిత్రాలతో పాటు ఎన్నో సినిమాలకు కథలు అందించిన విజయేంద్రప్రసాద్.. ‘శ్రీ కృష్ణ 2006’ అనే చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. అయితే, ఈ చిత్రంలో హీరోగా నటించాల్సింది రవితేజ. కానీ, ప్రొడ్యూసర్ సూచన మేరకు శ్రీకాంత్ తో సినిమా తీసేశారు. స్టార్ హీరో అయిన రవితేజతో సినిమా చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో..

విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన రెండో సినిమా ‘శ్రీవల్లి’. ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ కు తొలుత లీడ్ రోల్ కోసం తమన్నా భాటియా హీరోయిన్ అయితే బాగుండని ఓ ప్రొడ్యూసర్ సూచించారట. కానీ, విజయేంద్రప్రసాద్ కొత్త అమ్మాయితో తీశాడు. ఇది అంతగా ఆడకపోయినా తనకు సంతృప్తినిచ్చిన చిత్రమని పేర్కొన్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘రాజన్న’ చిత్రానికి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు.

దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ సాంగ్స్, మేకింగ్ చాలా బాగుంటుంది. కానీ, ఇది కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి డైరెక్ట్ చేయడం విశేషం. భవిష్యత్తులో తను ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ పేర్కొంటుండటం విశేషం. చూడాలి మరి అది అయినా తన తనయుడు రాజమౌళి సినిమాల కంటే గొప్ప విజయం సాధిస్తుందో లేదో..

 

 

Read more RELATED
Recommended to you

Latest news