మనదేశంలో దేవుళ్లకు ప్రత్యేక స్థానం ఉంది.. ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి..అందులో కొన్ని ఆలయాల కట్టడాలు మిస్టరీగానే ఉన్నాయి..ఇప్పుడు మనం చెప్పుకోబోయే కైలాష ఆలయ నిర్మాణం ఒక మిస్టరీ.. ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి..ఆ ఆలయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రాతినే కొండగా మలిచిన దైవసన్నిధి కైలాశ ఆలయం. మహారాష్ట్ర ఔరంగబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని కేవ్ 16లో ఈ ఆలయం ఉంది..కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకత అయితే పైనుంచి కిందకు చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం. ఇంతకీ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు. ఎందుకు నిర్మించారనేదానిపై విభిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి..100 అడుగులు ఆ రాయిని చెక్కారు.. పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్లపాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని గుర్తించారు.. క్రీస్తు శకంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది..
ఈ ఆలయాన్ని ధ్వంసం చెయ్యాలని ఎంతమంది ప్రయత్నించినా కూడా చెయ్యలేక పోయారు.. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు. ఆలయ ఆవరణలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి..ఈ మొత్తం నిర్మాణాన్ని పరిశీలిస్తే.. దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదంటున్నారు. ఎందుకంటే ఆలయంలో చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది.
అలాగే ఆలయం దిగువన గుండ్రని రంథ్రాలు కూడా చాలా లోతుగా ఉన్నాయి. ఇదంతా గమనిస్తే …ఈ ఆలయం కింద ఓ పట్టణం ఉందంటున్నారు. ఈ చిన్న గుహ నుంచి కిందికి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం. అంటే వేలఏళ్ల క్రిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా..ఈ నిర్మాణాన్ని అవే చేశాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అని తెలుస్తుంది..ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. ఆలయ నిర్మాణం ఆకట్టుకోవడంతో పర్యాటకుల రాక పెరుగుతుండటం విశేషం..