ఏడుపాయల మహా జాతరలో జోగిని శ్యామల భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు. నెత్తిన బోనం పెట్టుకొని, చేత తల్వార్, చర్నాకోలుతో అమ్మవారి సన్నిధి వరకు ఆసాంతం భక్తితో ముందుకు సాగారు. అనంతరం కళావేదికపై సాంస్కృతిక సారధి కళాకారులతో కలిసి స్టెప్పులేస్తూ రక్తి కట్టించారు. ఈఓ సార శ్రీనివాస్, ఇఫ్కో డైెరెక్టర్ దేవేందర్ రెడ్డి ఉన్నారు. మూడో రోజు గురువారం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో జాతర కిక్కిరిసింది.
మెదక్ : భక్తుల్లో జోష్ నింపిన జోగిని శ్యామల
-