నల్లగొండ పట్టణ అభివృద్ధికి గాను పనులు వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం నల్గొండ పట్టణ అభివృద్ది పనుల పురోగతిపై ఎమ్యెల్యేతో కలిసి అధికారులతో చర్చించారు. బీట్ మార్కెట్లో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ శంకుస్థాపన చేయడం జరిగిందని, పనులు వెంటనే మొదలు పెట్టాలని పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు.పట్టణంలో ఇతర అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు.