ఎడిట్ నోట్: ‘సరైనోడు’ బండి..!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా బలపడటంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర చాలానే ఉందని చెప్పొచ్చు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో…పరిస్తితులని చక్కగా బీజేపీకి అనుకూలంగా మార్చడంలో..అధికార టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచడంలో బండి కీలకపాత్ర పోషించారు. ఇంకా చెప్పాలంటే బండి అధ్యక్ష పదవిలోకి వచ్చాక…తెలంగాణలో బీజేపీకి మరింత ఊపు వచ్చింది. ఆయన నిత్యం అధికార టీఆర్ఎస్ పై పోరాటం చేయడంతో పాటు…బీజేపీని ఎక్కడకక్కడ బలోపేతం చేయడంలో ముందున్నారు.

ఇక బండి చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర బీజేపీకి పెద్ద ప్లస్. ఏదేమైనా గాని బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బండి పనిచేస్తున్నారు. అసలు ఎప్పుడు ఎలాంటి స్కెచ్ లతో బండి దూకుడుగా ముందుకెళ్తారో అర్ధం కావడం లేదు. ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడుతూనే…ఊహించని స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మునుగోడుతో పాటు మరో 10 స్థానాల్లో ఉపఎన్నికలు రానున్నాయని బాంబు పేల్చారు.

ఎలాగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక జరగడం ఖాయం. అయితే ఇది కాకుండా మరికొన్ని స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని అంటున్నారు…అది కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారు కూడా పదవులకు రాజీనామా చేసి…బీజేపీలో చేరి ఉపఎన్నికల బరిలో నెగ్గుతారని అంటున్నారు. అయితే ఇక్కడ బండి ఒక లాజిక్ చెబుతున్నారు. ఉపఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది.

అందుకే టీఆర్ఎస్ లో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు..పరోక్షంగా ప్రజలని రెచ్చగొట్టి..తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ తీసుకొచ్చి..అప్పుడు ప్రజలు చెప్పారని చెప్పి తమ పదవులకు రాజీనామా చేసి..బీజేపీలోకి వస్తారని…బండి చాలా క్లారిటీగా చెబుతున్నారు. అయితే ఇదంతా జరిగే పనేనా? అంటే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. కరుడుగట్టిన టీఆర్ఎస్ వాదిగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చారు..అలాగే కాంగ్రెస్ వాదిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీలోకి వస్తున్నారు.

కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు…కాకపోతే మరో 10 ఉపఎన్నికలు వస్తాయా? రావా? కంటే బండి మాత్రం…మానసికంగా టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు…ఇంకా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడమే కాకుండా…ఉపఎన్నికలు కూడా వస్తాయని చెప్పి…గులాబీదళం గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేస్తున్నారు. బండి కామెంట్స్ తో టీఆర్ఎస్ లో కొత్త గుబులు మొదలైపోయింది…అసలు ఎవరు బీజేపీలోకి టచ్ లో ఉన్నారు…ఎవరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారా? అని టీఆర్ఎస్ అధిష్టానం కంగారు పడే పరిస్తితి. మొత్తానికైతే కారు పార్టీని బండి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగేస్తున్నారని చెప్పొచ్చు.