ఎడిట్ నోట్: ముంచే ‘మూడు’ తప్పులు..!

-

అధికారం ఉంది కదా…మనం ఏం చేసినా కరెక్ట్..మనల్ని ఎవడ్రా ఆపేది అని పవన్ కల్యాణ్ డైలాగుని ఫాలో అయిన సరే ఉపయోగం ఉండదు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే..వాటికి అడ్డుకట్ట వేయడానికి భారత రాజ్యాంగంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఇష్టరీతినా నచ్చింది చేసుకుపోవడానికి లేదు. అధికారంలో ఉన్న ప్రభుత్వామైన సరే రాజ్యాంగానికి లోబడే పాలన చేయాలి. అలా చేయకపోతే మొట్టికాయలు తప్పవు.

ఇక ఈ విషయంలో ఏపీలోని జగన్ ప్రభుత్వానికి చాలానే మొట్టికాయలు పడినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేశాయి. అయినా సరే జగన్ ప్రభుత్వం తమకు నచ్చిన విధంగానే ముందుకెళుతుంది. అలాగే జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమైన సరే..ప్రతిపక్షాలు వాటిపై పోరాటాలు చేసినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు. ఇలా చేయడం వల్ల తమ పంతం నెగ్గుతుందేమో గాని ప్రజల్లో ఆదరణ రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల మద్ధతుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అదే ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి.

అలా కాకుండా ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే పలు అంశాల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. ఇక తాజాగా వైసీపీ చేసిన మూడు తప్పుల వల్ల మరింత ఇబ్బందికర పరిస్తితి ఏర్పడేలా ఉంది. అసలు జగన్ ప్రభుత్వం చేసిన మూడు తప్పులు ఏంటి..వాటి వల్ల నష్టం ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే. అసలు ఊహించని విధంగా 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఏర్పడిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చి..వైఎస్సార్ పేరు పెట్టేశారు.

రాత్రికి రాత్రే కేబినెట్ ఆమోదం తెలపడం..తర్వాత రోజు అసెంబ్లీలో దీనికి ఆమోదముద్ర వేసుకున్నారు. అసలు ఇప్పటికిప్పుడు పేరు మార్చల్సిన అవసరం ఏం వచ్చింది. 36 ఏళ్లుగా ఉంటున్న ఎన్టీఆర్ పేరు మార్చడం ఏంటి..పోనీ యూనివర్సిటీ ఏర్పాటులో వైఎస్సార్ ప్రమేయం ఉందా? అంటే అది లేదు. ఆఖరికి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడూ కూడా ఎన్టీఆర్ మార్చలేదు. మరి జగన్ ఎందుకు మార్చారు? అంటే ఇందులో పూర్తిగా రాజకీయ కొనమే కనబడుతోంది.

దీనిపై టీడీపీనే కాదు..మిగిలిన రాజకీయ పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ నిర్ణయం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే సొంత వైసీపీలో కొందరు నేతలు కూడా జగన్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటి వారు రాజీనామా చేశారు. ఏదేమైనా గాని ఈ నిర్ణయాన్ని అందరూ తప్పుబడుతున్నారు.

ఇది పక్కన పెడితే..ఆ మధ్య జూలై 7,8 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు పార్టీ అధ్యక్షుడుగా జగన్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే రెండేళ్లకు కాదు. శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ప్రజస్వామ్యంలో సొంత పార్టీ అయినా సరే ఇలా శాశ్వత అధ్యక్షుడుని ఎన్నుకునే అధికారం లేదు. ఇది భారత ఎన్నికల సంఘం రూల్స్ లో కూడా ఉంది.

దీనిపై ఎన్నికల సంఘం..వైసీపీకి పలుమార్లు లేఖలు కూడా రాసింది. మొదట్లో స్పందించలేదు గాని..తాజాగా మరోసారి గట్టిగానే హెచ్చరిస్తూ లేఖ విడుదల చేసింది. ‘‘మా ఆదేశాలపై మీరు స్పందించడంలేదు. మీ మౌనం జగన్మోహన్‌ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది’’ అని ఈ లేఖలో ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం వార్నింగ్‌తో వైసీపీ మాట మార్చింది..శాశ్వత అధ్యక్షుడుని ఎన్నుకున్నట్లు కేవలం మీడియాలోనే కథనాలు వచ్చాయని, దీనిపై మా పార్టీ అంతర్గత విచారణ ప్రారంభించిందిని, అసలు వాస్తవాలేమిటో తెలిసిన తర్వాత… తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్‌కు వైసీపీ తెలిపింది.

ఇక చివరిగా ‘‘ఆ అంతర్గత విచారణను వీలైనంత త్వరగా ముగించండి. మీడియాలో వచ్చినట్లుగా జగన్‌ను వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా నియమించలేదని ప్రకటించండి. ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించండి’’ అని ఈసీ ఆదేశించింది. అలాగే పార్టీకి సంబంధించిన పదవులను శాశ్వతంగా అప్పగించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, నిర్దిష్ట గడువు ప్రకారం ఆయా పదవులకు ఎన్నికలు జరపాల్సిందేనని వైసీపీని హెచ్చరించింది.

చివరిగా మూడో మిస్టేక్ ఏంటంటే..ఎప్పుడు ఉండేదే..ఎడాపెడా అప్పులు చేయడంపై కాగ్..జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోందని, రుణాలని భరించే సామర్థ్యం రాష్ట్రానికి లేదని, ఇప్పటికే తలసరి బకాయి రూ.67,484 ఉందని, రుణాలు చెల్లించేందుకే మళ్ళీ అప్పులు చేస్తున్నారని, రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ అధ్వాన్నంగా ఉందని కాగ్..వైసీపీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. మొత్తానికి ఈ తప్పులు వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు పెంచేవి అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news