ఎడిట్ నోట్: బాబు కంటే పవన్ బెటర్.!

-

మొత్తానికి ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి..ఇటీవల మోదీ పర్యటన తర్వాత రాజకీయం మరింత రసవత్తరంగా సాగుతుంది..మోదీతో పవన్ భేటీ అవ్వడం, ఆ తర్వాత మోదీతో జగన్ భేటీ కావడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అసలు మోదీ తమ మిత్రపక్షంగా ఉన్న పవన్‌కు సపోర్ట్ చేస్తున్నారా లేక జగన్‌కు సపోర్ట్ గా ఉంటున్నారా? అనేది క్లారిటీ రావడం లేదు. పైగా మోదీని కలిసిన తర్వాత కూడా పవన్..ఇంకా ఎక్కువగా జగన్‌ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

ప్రజా క్షేత్రంలోకి వచ్చి, వైసీపీ అక్రమాలని ఎండగట్టే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. అలాగే వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా పవన్ పోరాటం మొదలుపెట్టారు. వైసీపీ వాళ్ళు ఒకటి తిడితే, మేము నాలుగు తిడతామనే విధంగా పవన్ రాజకీయం నడుస్తోంది. క్షేత్ర స్థాయిలో వైసీపీ అక్రమాలని ఎండగట్టే రీతిలో పోరాటం మొదలుపెట్టారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు కంటే ఎక్కువగానే పవన్, ప్రజల్లోకి వెళుతున్నారనే విధమగా పరిస్తితులు మారుతున్నాయి.

వాస్తవానికి కొన్ని విషయాల్లో పవన్, బాబు కంటే బెటర్ గా కనిపిస్తున్నారు. ఎప్పటినుంచో జగనన్న కాలనీఎల్‌ఎల్ ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అక్రమాలపై మాట్లాడుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పెద్దగా పోరాటాలు చేయలేదు. దీని వల్ల ఆ అక్రమాలు ఏంటి అనేవి ప్రజలకు పూర్తిగా తెలియలేదు.

కానీ ఇప్పుడు పవన్ మాత్రం క్షేత్ర స్థాయిలోకి వెళ్లారు. జగనన్న కాలనీల్లో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు సైతం తమ ప్రాంతాల్లోనే జగనన్న కాలనీల్లో తిరిగారు. విజయనగరంలో పవన్ పర్యటించి, అక్కడ కాలనీలో పరిస్తితులు గమనించారు. ఇళ్ల స్థలాల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఇళ్ల నిర్మాణాల్లో ఏం చేస్తున్నారనేది క్లియర్ గా చెప్పారు.

అలాగే తాము అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీ గా ఇస్తామని, ఇప్పుడు వచ్చే ప్రతి పథకాన్ని కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ క్లారిటీ మాత్రం బాబు ఇవ్వలేదు..నెక్స్ట్ చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు ఆగిపోతాయని వైసీపీ ప్రచారం చేస్తుంది..ఆ ప్రచారానికి టి‌డి‌పి పెద్దగా కౌంటర్ ఇవ్వలేకపోయింది.

అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక రేట్లు భారీగా పెరిగాయి..ఈ విషయంలో కూడా తాము అధికారంలోకి వస్తే మళ్ళీ ఫ్రీ గా ఇస్తామనే అంశాన్ని టి‌డి‌పి హైలైట్ చేయలేకపోయింది. కానీ పవన్ హైలైట్ చేశారు..దీంతో ప్రజల్లో పవన్‌పై ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఇప్పటికే పవన్ అన్నిరకాలుగా హైలైట్ అవుతున్నారు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే బాబు కంటే పవన్ బెటర్ అని ప్రజలు ఆలోచించుకునే పరిస్తితికి వచ్చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news