ఎడిట్ నోట్: రాజీనామా ‘విజయం’..!

నేటి రాజకీయాల్లో విలువలు ఉన్నాయా? అంటే ఏమో అవి ఎలా ఉంటాయో కూడా తెలియదనే పరిస్తితి..ఒకప్పుడు రాజకీయాలు చాలా నిర్మాణాత్మకంగా నడిచేవి…అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు హుందాగా ఉండేవి..అలాగే అధికార పార్టీ ప్రత్యర్ధి పార్టీ నేతలని బెదిరించడం…ఆర్ధిక మూలాలు దెబ్బతీయడం…లాంటివి చేసి పార్టీలోకి లాగే కార్యక్రమాలు చేసేది కాదు…కానీ ఇప్పుడు పరిస్తితి పూర్తిగా మారిపోయింది…అసలు ఇప్పుడు ప్రతిపక్షమే ఉండకూడదనే కాన్సెప్ట్ అధికార పార్టీలకు వచ్చేసింది. అలా చేయడం కోసం..ప్రత్యర్ధులని టార్గెట్ చేసుకుని ఎలాంటి రాజకీయం చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు..ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలని లాగేస్తున్నారు.

ఇలా చేసి ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ఏకపక్షంగా గెలిచేయొచ్చు అనేది అధికార పార్టీ కాన్సెప్ట్. అలా చేస్తే ప్రజలే ప్రతిపక్షాన్ని సృష్టించి…అధికార పక్షానికి చెక్ పెడతారని చెప్పొచ్చు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్…తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసే కార్యక్రమాలు చేసింది. టీడీపీ, కమ్యూనిస్టుల అడ్రెస్ లేకుండా చేసింది…అలాగే కాంగ్రెస్ పార్టీని సైతం చాలావరకు దెబ్బతీసింది. ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలని పెద్ద సంఖ్యలో లాగేసింది.

ఈ విధంగా చేయడం వల్ల టీఆర్ఎస్ చాలావరకు బలపడింది..అదే సమయంలో ప్రతిపక్షాలు అడ్రెస్ లేకుండా పోయాయి. అసలు ప్రతిపక్షం అనేది లేకుండా పోతే నియంత పాలన మాదిరిగా తయారవుతుంది…అందుకే తెలంగాణ ప్రజలు…సరికొత్త ప్రతిపక్షాన్ని సృష్టించారు. ఇంతవరకు ఆదరణ లేని బీజేపీని ఆదరించడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీని నిలబెట్టారు. ఇప్పుడు బీజేపీతోనే టీఆర్ఎస్ పార్టీకి పెద్ద చిక్కు వచ్చి పడింది…వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించే శక్తి బీజేపీకి వస్తుంది.

ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో…టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి…బీజేపీ సత్తా చాటుతుంది…ఇప్పుడు మునుగోడులో కూడా కారు పార్టీని చిత్తు చేయాలని చూస్తుంది. అయితే టీఆర్ఎస్ చేసిన తప్పుని బీజేపీ చేయకుండా విజయాలు అందుకుంటుందనే చెప్పాలి. ఎప్పుడైతే రాజకీయాల్లో విలువలు పాటిస్తారో…అప్పుడే విజయాలు అందుతాయి. సేమ్ అదే ఫార్ములాతో బీజేపీ ముందుకెళుతుంది.

ఇతర పార్టీల నుంచి వచ్చే వారి చేత రాజీనామా చేయించి మరీ…పార్టీలోకి తీసుకుంటున్నారు. ఈటల రాజేందర్ అయిన, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అయినా సరే..ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించి…పార్టీలోకి తీసుకుంటున్నారు. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…బీజేపీలో చేరి…హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు..అలాగే త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. అలాగే మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలబడనున్నారు.

ఇలా ఒక పార్టీ గుర్తుపై గెలిచినప్పుడు…ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి..వేరే పార్టీలో చేరడం అనేది మంచి ప్రక్రియ. ఇలాంటి విషయాలని ప్రజలు ఎప్పుడు సమర్ధిస్తారు. అయితే టీఆర్ఎస్ అలా చేయలేదు…కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలని లాగేసి…వారితో రాజీనామాలు చేయించలేదు. పైగా కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే ఇలా విలువలు లేకుండా చేసిన రాజకీయానికి త్వరలోనే మూల్యం చెల్లించే టైమ్ వస్తుందని చెప్పొచ్చు. కానీ బీజేపీ అలా చేయకుండా విలువలు పాటిస్తూ…ముందుకెళుతుంది. ఇలా రాజీనామాలు చేయించి..నేతలని పార్టీలోకి తీసుకోవడం వల్ల బీజేపీకి విజయమే దక్కుతుందని చెప్పొచ్చు.