ఎడిట్ నోట్: కుప్పం ‘ఓటు’ మారుతుందా..!

-

1983 టూ 2019..కుప్పంలో ఎలాంటి మార్పు లేదు..అంటే అభివృద్ధి విషయంలో కాదు..రాజకీయం విషయంలో. 1983 నుంచి కుప్పం ప్రజలు టీడీపీని ఆదరిస్తూనే ఉన్నారు. 1983, 1985 టీడీపీ పరిస్తితి ఒక ఎత్తు అయితే..1989 నుంచి మరొక ఎత్తు. ఎందుకంటే 1989 నుంచి అక్కడ చంద్రబాబు పోటీ చేస్తూ వస్తున్నారు. వరుసపెట్టి ఏడు సార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే మధ్యలో మూడు సార్లు సీఎం అయ్యారు. అప్పుడు కుప్పంలో ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎక్కడో రాష్ట్రం నుంచి విసిరేసినట్లు ఉండే కుప్పంకు ఓ గుర్తింపు తెచ్చారు.

ఈ విషయాన్ని అక్కడి ప్రజలే ఒప్పుకుంటారు. అందుకే ఎప్పుడు బాబుకు మద్ధతుగా నిలుస్తారు. అయితే ఈ సారి కుప్పం ప్రజల నుంచి బాబు దూరం చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం నడుపుతున్నారో అందరికీ తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పంలో పెట్టి..అక్కడ టీడీపీని దెబ్బతీసే విధంగా ముందుకెళుతున్నారు.

ఇక అధికార బలంతో కుప్పంలో టీడీపీని చాలావరకు దెబ్బతీశారు. పంచాయితీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేశారు. పరిషత్ ఎన్నికల్లో చావుదెబ్బ తీశారు. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీలో కూడా టీడీపీని దారుణంగా ఓడించారు. దీంతో కుప్పంలో బాబు పని అయిపోయిందని, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బాబుని చిత్తుగా ఓడిస్తామని వైసీపీ నేతలు గట్టిగానే సవాళ్ళు విసురుతున్నారు.

అయితే వైసీపీ దెబ్బకు బాబుకు కూడా భయం పుట్టింది. ఎప్పుడు దూరంగా ఉంటూనే కుప్పంలో పనులు చేయించే బాబు..ఇప్పుడు పదే పదే కుప్పం వెళ్లాల్సిన పరిస్తితి వచ్చింది. పార్టీ డ్యామేజ్‌ని బాగుచేసుకోవాల్సిన పరిస్తితి వచ్చింది. కానీ బాబుకు జగన్ ఎప్పటికప్పుడు చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో జగన్ తాజాగా కుప్పంకు వెళ్ళి..అక్కడ వైఎస్సార్ చేయూత మూడో విడతకు బటన్ నోక్కారు. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు.

యథావిధిగానే బాబుపై విరుచుకుపడ్డారు. బాబు ఇన్నేళ్లలో కుప్పం ప్రజలకు చేసిందేమి లేదని, తమ పాలనలోనే కుప్పం ప్రజల పరిస్తితి మెరుగైందని, కుప్పానికి బాబు నాన్ లోకల్..హైదరాబాద్‌కు లోకల్ అని, ఇన్నేళ్లలో కుప్పం సీటు బీసీలకు ఇవ్వలేదని జగన్ విమర్శించారు. అయితే ఈ విమర్శల్లో ఎంత లాజిక్ ఉందనేది కుప్పం ప్రజలకు గాని, రాష్ట్ర ప్రజలకు గాని బాగానే అర్ధమవుతుంది. కాబట్టి వీటి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి..తాజాగా జగన్ సభ వరకు చూసుకుంటే…కుప్పంలో ఓటర్ల మనసు ఏమన్నా మారిందా? జగన్ మాటలకు కుప్పం ప్రజలు..వైసీపీ వైపు తిరుగుతారా? అంటే అలాంటి పరిస్తితి ఏ మాత్రం కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కుప్పంకు బాబు ఏం చేశారో..అక్కడి ప్రజలకు బాగా తెలుసు..ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎక్కడో ఉన్నారో తెలుసు. బీసీలకు సీటు అంటే..పులివెందుల సీటు ఇంతవరకు రెడ్డి కులానికి తప్ప..వేరే వాళ్ళకు ఇవ్వలేదు. అయితే ఈ లాజిక్ కూడా కరెక్ట్ కాదు. పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కోట. అలాగే జగన్ మాట్లాడిన లాజిక్‌లు కూడా కరెక్ట్ గా అనిపించడం లేదు. బాబు నాన్ లోకల్, కుప్పం బీసీలకు ఇవ్వాలి అనేది లాజిక్ లేని విమర్శలు. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే జగన్ ప్రభావం వల్ల కుప్పంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. మరీ ఓటర్లు వన్ సైడ్‌గా వైసీపీ వెళ్ళే అవకాశాలు తక్కువ అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news