పవన్ కల్యాణ్.. నిలబడితే గెలుస్తావు.. లేకుంటే చిరంజీవి పరిస్థితే?

2019 ఎన్నికల్లో తను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ ఘోరంగా ఓడిపోయారు. జనసేన మొత్తం మీద గెలిచింది ఒక్క సీటు. ఒక్కటంటే ఒక్కటే సీటు. ప్రజారాజ్యం కన్నా దారుణ పరిస్థితి జనసేనది.

పవన్ కల్యాణ్.. ఆయన సినిమాల గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు. ఏ స్టార్ హీరోకు కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. సో.. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ స్టార్ హీరో రేంజ్‌ను అనుభవించాడు. ఓకే.. సినిమాల పరంగా పవన్ కల్యాణ్ నెంబర్ వన్.. ఒప్పుకుందాం. మరి.. రాజకీయాలు? దీని గురించే ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది.

pawan kalyan do not quit, be like warrier

పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడాలంటే.. మనం ఓ 10 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. పవన్ కల్యాణ్.. అన్న.. చిరంజీవి.. మామూలు చిరంజీవి కూడా కాదు ఆయన.. మెగాస్టార్ చిరంజీవి. 10 ఏళ్ల క్రితమే చేతులు కాల్చుకున్నాడు. ఎలా.. పార్టీ పెట్టి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. సినిమాల్లో చిటికేస్తే అన్నీ జరిగినట్టుగా నిజ జీవితంలోనూ చిటికేస్తే ముఖ్యమంత్రి అయిపోవచ్చని అనుకున్నాడు కానీ.. సీన్ రివర్స్ అయింది. ప్రజారాజ్యానికి ఏదో అరకొరగా సీట్లు వచ్చాయి. అయితే.. ప్రజారాజ్యానికి ఎన్ని సీట్లు వచ్చాయి.. అనే విషయాన్ని వదిలేస్తే.. ఆ సమయంలో చిరంజీవి నిలబడ్డాడా? లేదు. నిలబడలేకపోయాడు. పార్టీని కొనసాగించలేకపోయాడు. పార్టీని తీసుకపోయి కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. అంటే.. తన పార్టీని తానే భూస్థాపితం చేసేశాడన్నమాట. నిజంగా చిరంజీవి అప్పుడు తప్పుకోకుండా.. నిలబడగలిగి ఉంటే.. ఇప్పుడు సీను వేరేగా ఉండేది. 2014 లో కాకుండా.. మొన్నటి ఎన్నికల్లో అయినా కాస్తో కూస్తో పోటీ ఇచ్చేవాడు. 2019లో సీఎం అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ.. ఆయన నిలబడలేకపోయాడు. తప్పుకున్నాడు. అందుకే.. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసుకుంటున్నాడు. బహుషా.. ఆయన ఇక రాజకీయాల్లోకి రాకపోవచ్చు. ఇక ఆయన్ను వదిలేద్దాం.

కట్ చేస్తే.. పవన్ కల్యాణ్.. చాలా ఆవేశ పరుడు, కానీ మంచి వ్యక్తే. సమాజానికి ఏదో చేద్దామనే తపన ఉంది. అందరు రాజకీయ నాయకుల్లా ఉండడు. కానీ.. ఆయనలో ఏదో లోపం ఉంది. అదే ఆయన్ను కనీసం అసెంబ్లీ దాక కూడా తీసుకువెళ్లలేకపోయింది.

2019 ఎన్నికల్లో తను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ ఘోరంగా ఓడిపోయారు. జనసేన మొత్తం మీద గెలిచింది ఒక్క సీటు. ఒక్కటంటే ఒక్కటే సీటు. ప్రజారాజ్యం కన్నా దారుణ పరిస్థితి జనసేనది. మరి.. అన్న చిరంజీవిలా తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా తప్పుకుంటాడా? దైర్యంగా నిలబడతాడా? లేదా? 2024 ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం.. ప్రస్తుతానికి ఖాళీగా ఉండటం ఎందుకు అని సినిమాల్లో నటిస్తాడా?

పవన్ కల్యాణ్.. నువ్వు సినిమాల్లో నటించాలనుకుంటే.. వెళ్లు కానీ.. మళ్లీ రాజకీయాల్లోకి రాకు. ఒకవేళ దైర్యంగా నిలబడగలిగే సత్తా నీకు ఉంటే. నిలబడు. పోరాడు. నిలబడలేకపోయావా? అయిపోయినట్టే.. ప్రజారాజ్యం పరిస్థితే జనసేనకూ పడుతుంది. చిరంజీవి పరిస్థితే నీకూ ఎదురవుతుంది. రాజకీయాలను పార్ట్ టైమ్‌గా ఎంచుకోవడం కాదు.. లేదా సినిమాలను పార్ట్ టైమ్‌గా ఎంచుకోవడం కాదు. అయితే సినిమానా? లేక రాజకీయమా? ఏదో ఒకటి ఇప్పుడే డిసైడ్ చేసుకో. సినిమాల్లోకి వెళ్తే దయచేసి రాజకీయాల్లోకి రాకు. రాజకీయాల్లో ఉంటే దయచేసి సినిమాల్లోకి వెళ్లకు. నీ నుంచి సగటు అభిమాని కోరుకునేది ఇదే. అందుకే.. దైర్యంగా నిలబడు. నిలబడితే గెలుస్తావు. ఖచ్చితంగా గెలుస్తావు. నీ సినిమా డైలాగ్‌తోనే చెబుదాం. నువ్వు గెలవడం మాత్రం పక్కా. కాకపోతే కాస్త టైమ్ పడుతుంది. ఆ టైమే నిన్ను పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో నెగ్గుతావో లేక ఓడిపోతావో నువ్వే నిర్ణయించుకో.