ఎడిట్ నోట్: సేనాని ‘సింగిల్’!

-

రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడుప్పుడే రాటుదేలుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తూ వచ్చిన పవన్ కు…పూర్తి స్థాయిలో రాజకీయ వ్యూహాలు అమలు చేయడం తెలిసినట్లు లేదనే చెప్పాలి. ఒకవేళ ప్రత్యర్ధుల వ్యూహాలు తెలిసే ఉంటే..గత ఎన్నికల్లోనే పవన్ గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టేవారు. బలంగా ఉన్న జగన్, చంద్రబాబులకు ధీటుగా పవన్ రాజకీయం చేయలేకపోయారు. అందుకే చాలా వరకు విఫలమయ్యారు.

కానీ ఓటమి వల్ల చాలా నేర్చుకోవచ్చని పవన్ నిరూపిస్తున్నారు…ఓటమి తర్వాత పవన్ రాజకీయం పూర్తిగా మారింది.. పూర్తిగా అవగాహన లేకుండా ఏది చేయడం లేదు..తమ బలం పెంచుకోవడం కోసం అంచలంచెలుగా ముందుకెళుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ…ప్రజల్లో స్థానం సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న టీడీపీకి ధీటుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ…ప్రజలకు తాను ఉన్నానని చూపిస్తున్నారు.

అలాగే బీజేపీతో పొత్తులో ఉన్నా సరే…సింగిల్ గానే పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటివరకు అదేవిధంగా పోరాటాలు చేసుకుంటూ వచ్చారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా పవన్ ఇప్పుడు వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పొత్తుల విషయంలో తనదైన శైలిలో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా గుడ్డిగా మద్ధతు ఇవ్వకుండా…ఇప్పుడు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు.

పవన్ ఎలాగో ఆటోమేటిక్ గా తమకే మద్ధతు ఇస్తారని చంద్రబాబు భావించినట్లు ఉన్నారు…అందుకే పవన్ విషయాన్ని బాగా లైట్ తీసుకున్నట్లు కనిపించారు. కానీ పవన్ పూర్తిగా రివర్స్ అయ్యారు…ఇప్పటివరకు తాము తగ్గామని, ఇక ఈ సారి మీరే తగ్గాలని టీడీపీకి పరోక్షంగా సూచించారు. ఇలా పవన్ రివర్స్ అయ్యేసరికి టీడీపీ వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మొదలుపెట్టారు.

తమకు సింగిల్ గానే సత్తా ఉందని, వార్ వన్ సైడ్ అయిపోయిందని మాట్లాడుతున్నారు…కానీ వాస్తవ పరిస్తితులు అలా లేవు…ఇప్పటికీ టీడీపీకి కష్టాలు ఉన్నాయి…జనసేన కలిస్తే కొద్దో గొప్పో ఆ పార్టీకి ప్లస్ లేదంటే అస్సామే. అయితే టీడీపీతో పోటీగా పవన్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ…తమ పార్టీ బలం ఇంకా పెంచుకునే దిశగా పనిచేస్తున్నారు. పొత్తుల గురించి ఇప్పుడే ఆలోచించాలని పవన్ అనుకుంటున్నట్లు లేరు. పైగా ప్రజలు మార్పు కోరుకుంటే తమని ఆదరించే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకుంటున్నారు.

ఒకవేళ సింగిల్ గానే పోటీ చేస్తే తమకు మంచి ఫలితాలే రావోచ్చని భావిస్తున్నారట. అప్పుడు వైసీపీ-టీడీపీలకు మెజారిటీ సీట్లు రాకపోతే…కింగ్ మేకర్ గా ఉండొచ్చని పవన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పుడు ఆటోమేటిక్ గా పవన్ అవసరం పడుతుంది. కాబట్టి ఇప్పుడు సింగిల్ గానే ముందుకెళుతూ…ఎన్నికల్లో కూడా కుదిరితే బీజేపీతో కలిసి…లేదంటే సింగిల్ గానే పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే పొత్తుల గురించి పవన్ ఇప్పుడు ఆలోచించేలా లేరు…మొత్తానికి సోలో గానే వార్ లో దిగేలా ఉన్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో సేనాని రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news