ఎడిట్ నోట్ : విజ‌న్ 2024 లో గెలుపు ఎవ‌రిది ? ఓవ‌ర్ టు జ‌గ‌న్  

-

జ‌గ‌న్ అనుకుంటే కానిది ఏమీ లేదు
కానీ ఆయ‌న అనుకోవ‌డం లేదు
నింద కాదు నిట్టూర్పు కాదు
కానీ వాస్త‌వం అయితే ఇదే !

అలా అని టీడీపీ హయాంలో జ‌రిగిన అభివృద్ధికి కొన‌సాగింపు ఇస్తారా ..అంటే అదీ సందేహ‌మే ! అడ్డు వ‌స్తే చిల్డ్ర‌న్ పార్కుల‌ను సైతం కూల్చి వేసిన ఘ‌ట‌న‌లు శ్రీ‌కాకుళం జిల్లా, న‌ర‌స‌న్న‌పేట‌లో నిన్న‌మొన్న‌టి వేళ చోటు  చేసుకున్నాయి..అన్న‌ది టీడీపీ ఆరోప‌ణ. వాస్త‌వం ఎలా ఉన్నా జ‌గ‌న్ అంగీక‌రించినా అంగీక‌రించ‌కున్నా డ‌బ్బు పంచే విధానానికి మోడీ కూడా వ్య‌తిరేక‌మే! అందుకే ఆయ‌న‌ర ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వ‌రు.ఆఖ‌రికి పంచాయ‌తీల అభివృద్ధికి కూడా ఆయ‌నే నేరుగా నిధులు ఇస్తామ‌ని అంటున్నారే కానీ ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వ జోక్యాన్ని అస్స‌లు ఒప్పుకోవ‌డం లేదు. ఓ విధంగా ఓవ‌ర్ డ్రాఫ్ట్ ను కూడా ఆర్బీఐ దగ్గ‌ర అడ్డుకోవాల్సింది కూడా కేంద్ర‌మే! కానీ ఎందుక‌నో అప్పుల‌కు అనుమ‌తులు ఇచ్చి త‌రువాత దెప్పి పొడుస్తోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ఈ ద‌శ‌లో అభివృద్ధి సాధ్య‌మా ? ఇదే ఇవాళ్టి ఎడిట్ నోట్.. చ‌ద‌వండిక.

ఫార్ములా బేస్డ్ పాలిటిక్స్ కు ఏపీ పెట్టింది పేరు. ఆంధ్రావ‌నిలో రెండు పార్టీలు మాత్ర‌మే ఇలాంటి ప‌నులు బాగా చేయ‌గ‌ల‌వు. ఒక‌టి టీడీపీ కాగా రెండోది వైసీపీ.ఆ విధంగా వైసీపీని దాటి టీడీపీ రాజ‌కీయం కూడా చేయ‌లేక‌పోతోంది. ఇవాళ అంటే మార్చి 29  తెలుగుదేశం ఆవిర్భావం క‌నుక మ‌నం ఏం మాట్లాడుకున్నా ఆ పార్టీ గురించే మాట్లాడుకోవాలి. లేదంటే ప‌సుపు దళం స‌భ్యులు ఒప్పుకోరు. అదేవిధంగా చంద్ర‌బాబు గురించి కూడా వీలున్నంత మాట్లాడుకోవాలి. కానీ ఇవి మాట్లాడుకుంటూనే కొన్ని జ‌గ‌న్ గురించి చెప్పుకోవాలి.

ఆంధ్రాలో టీడీపీని భూ స్థాపితం చేస్తామ‌ని ఓ  సారి, చంద్ర‌బాబు నా దృష్టిలో ఏమీ కాదు అని చెప్పి ఓ సారి వార్త‌ల్లో నిలిచిన జ‌గ‌న్ నిజంగానే త‌న యుద్ధం తీవ్ర‌త‌రం చేస్తారా అన్న‌ది ఓ సందేహం. అనుకున్నంతగా ఆయ‌న రాణిస్తారా? ఇప్ప‌టికైతే జ‌గ‌న్ సేఫ్. సంక్షేమ ప‌థ‌కాలే ధ్యేయంగా ఆయ‌న వెళ్తున్నారు క‌నుక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు ఖాయం అని రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా వినిపిస్తున్న మాట‌లు. అందుకే కేంద్రం కూడా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగానే ఉంటుంది. ఒక‌వేళ ఏమ‌యినా జ‌ర‌గ‌రానివి జ‌రిగితే సీన్ లోకి ఆమ్ ఆద్మీ పార్టీ రావ‌డం కానీ టీడీపీలో కానీ వైసీపీలో కానీ చీలిక‌లు వ‌స్తే అప్పుడు జ‌గ‌న్ అనుకున్న విధంగా ఫ‌లితాలు పొంద‌లేరు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక‌వేళ జ‌గ‌న్ గెలిచినా కూడా ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న విజ‌న్ ఏంటి..? అభివృద్ధి విష‌య‌మై ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలేంటి ? అదేవిధంగా ఏటా దాదాపు ల‌క్ష కోట్లు సంక్షేమానికే కేటాయించే సీఎంకు నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయి. ఇప్ప‌టికే బ‌డ్జెటేత‌ర నిధులు చాలా దుర్వినియోగం అయ్యాయ‌ని కాగ్ చెబుతోంది. ఇక‌పై కూడా ఇదే విధంగా చేస్తారా?
లేదా రాజ‌ధాని కోసం చంద్ర‌బాబు సేక‌రించిన భూములు అమ్మి పాల‌న చేస్తారా ? ఇవే ఇప్పుడు వేధిస్తున్న ప్ర‌శ్న‌లు. వాస్త‌వానికి
నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి అన్న‌ది అస్స‌లు అమ‌లులో లేని ప‌ని. కార్యాచ‌ర‌ణ కూడా ! కేంద్రం కొంత ముందుకు వ‌చ్చినా కూడా చాలా ప్రాజెక్టుల‌కు రాష్ట్రం చెల్లించాల్సిన వాటా చెల్లించ‌క‌పోవ‌డం ప‌నులు ఆరంభం కావ‌డం లేదు. అర‌వై శాతం నిధులు కేంద్రం ఇచ్చినా న‌ల‌భై శాతం రాష్ట్ర  వాటా కింద ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ఉమ్మ‌డి భాగ‌స్వామ్యంతో చేయాల్సి ఉంది. కానీ జ‌గ‌న్ కు  ఆ శ్ర‌ద్ధ కానీ ఆస‌క్తి కానీ లేవ‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా బీజేపీ ప‌దే ప‌దే చెబుతోంది.దీంతో  విజ‌న్ 2024 అంటే మ‌ళ్లీ డ‌బ్బులు పంచడ‌మేనా ? అన్న‌ది ఆర్థిక‌వేత్త‌ల అనుమానం.

– ఎడిట్ నోట్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version