రోజుకు గంట పని చేస్తే నెలకు రూ. 10 లక్షల జీతం ఇస్తున్న గూగుల్‌

-

టైటిల్‌ చూసి టెమ్ట్‌ అయి వచ్చారా..? రోజు అంతా కష్టపడినా నెలకు 40 వేలు రావడం లేదు. అలాంటిది. రోజుకు కేవలం ఒక గంట సేపు పని చేస్తే చాలు. ఏకంగా రూ.10 లక్షలు వస్తుందంటే బంపర్‌ ఆఫరే కదా..! ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా? లేక ఇదంతా బిస్కెటేనా అనుకుంటున్నారా..? అని కూడా అనుకుంటున్నారు కదా?

ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గూగుల్‌లో పని చేస్తున్నాడు. ఈయన వార్షిక వేతనం ఏకంగా 1.5 లక్షల డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు రూ.1.2 కోట్లు. గూగుల్‌లో పని చేస్తున్న ఈ టెక్కీ రోజంతా పని చేయరు. రోజుకు కేవలం ఒక గంట మాత్రమే పని చేస్తారట. గూగుల్ టూల్స్‌కు, ప్రొడక్ట్స్‌కు కోడ్ రాయడం ఈయన పని. మిగతా టైమ్‌లో ఈయన తన స్టార్టప్ కోసం పని చేస్తారు. ఈయన ముందుగా గూగుల్‌లో ఇంటర్న్‌గా చేరారు. తర్వాత క్రమక్రమంగా మంచి పొజిషన్‌లోకి వెళ్లారు. ఈ గూగుల్ టెక్కి ఇంటర్న్ చేసే సయమంలో కూడా పనిని ముందుగానే ఫినిష్ చేసే వారట. తర్వాత వీక్ లాంగ్ ట్రిప్‌కు వెళ్లేవారట.

ఎక్కువ గంటలు పని చేయడానికి అయితే స్టార్టప్‌లో ఉంటానని ఈ గూగుల్ టెక్కి తెలిపారు. గూగుల్‌లో వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకోవచ్చు.. యాపిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లు ఎక్కువ గంటలు పని చేస్తారు. కానీ గూగుల్‌లో అలా ఉండదని ఈ గూగుల్ టెక్కి పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే అధిక వేతనాలు చెల్లించే కంపెనీల్లో గూగుల్ కూడా ఒకటి. టాప్ 3లో ఈ కంపెనీ ఉంది. అంతేకాకుండా పని చేయడానికి అనువైన కంపెనీల్లో కూడా గూగుల్ ఒకటి. అందుకే చాలా మంది గూగుల్‌లో పని చేయడానికి ఇష్టపడతారు.

గూగుల్ కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 97 శాతం మంది ఉద్యోగులు పని చేయడానికి గూగుల్‌ ఉత్తమమైన కంపెనీ అని అంటున్నారు. కంపెనీ తన ఉద్యోగులకు వివిధ బెనిఫిట్స్ కల్పిస్తోంది. క్యాంపస్ ఎన్విరాన్‌మెంట్, కాంప్లిమెంటరీ మీల్స్, కాంపిటీటివ్ ప్యాకేజెస్ వంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు ఇలాంటి జాబ్స్‌ రావాలంటే ఎంత కష్టపడి ఉండాలో అనుకుంటారు కదా..! చదువు అనే పునాది స్ట్రాంగ్గా ఉంటే అన్నీ అవే వస్తాయి. అలా అని చదువు మాత్రమే ఉంటే సరిపోదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version