కంప్యూట‌ర్ సైన్స్ విద్యార్థుల‌కు గూగుల్ గుడ్ న్యూస్..రూ.70,000 స్కాల‌ర్‌షిప్..!

-

కంప్యూటర్ సైన్స్ చదివే మహిళలకి గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. స్కాలర్ షిప్ ని ఆ మహిళలక్కీ ఇస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆసియా-పసిఫిక్ నుంచి వచ్చిన మహిళల కోసం మొదలు పెట్టింది. భారతీయ విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు అర్హులు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

కంప్యూటర్ సైన్స్‌లో మహిళల కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అభ్యసించడానికి విద్యార్థులకు అందిస్తోంది. ఎంపికైతే 2022-2023 విద్యా సంవత్సరానికి $1000 (రూ.74191.35) విలువైన స్కాలర్‌షిప్‌ వస్తుంది. దీని కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం వుంది.

2021-2022 విద్యాసంవ‌త్స‌రంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో దరఖాస్తు చేసుకునేవారు నమోదు అయి ఉండాలి. ఆసియా-పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం విద్యార్థి అయి ఉండాలి. సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా దగ్గరి సంబంధం ఉన్న సాంకేతిక రంగం విద్య‌న‌భ్య‌సిస్తూ ఉండాలి మరియు మంచి మార్కులు వస్తూ ఉండాలి. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చు.

ముందుగా https://buildyourfuture.withgoogle.com/scholarships/ లింక్‌ ఓపెన్ చెయ్యాలి.
Generation Google Scholarship (Asia Pacific) లింక్‌ను ఎంచుకోవాలి.
అప్లై నవ్ మీద క్లిక్ చెయ్యాలి.
ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 10, 2021 లోగా అప్లై చేసుకోవాల్సి వుంది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version