పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా..!

-

కరోనా కేసులు మరో సారి పెరుగుతున్న నేపథ్యం లో ఈ నెల 24వ తేదీ నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్‌ డిప్లొమా ప్రథమ, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ప్రకటించింది. కనుక విద్యార్థులు ఈ విషయాన్నీ గమనించండి.

ఇది ఇలా ఉంటే జేఎన్‌టీయూ, ఉస్మానియా, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలు మాత్రం యధావిధిగా పరీక్షలని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు కూడా కాలేజీల్లో ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని ఆదేశించాయి. ఇది పక్కన పెడితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణపై ఇంకా స్పష్టత అయితే రాలేదు.

ప్రాక్టికల్స్ పరీక్షలు కూడా వాయిదా పడే లాగే కనపడుతోంది. ఏప్రిల్ 7 నుంచి మాత్రం పరీక్షలు జరిగే పరిస్థితులు లేవు. పరీక్షల నిర్వాహణ పై ప్రభుత్వం తో సంప్రందించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా తెలంగాణ లో విద్యాసంస్థలను నేటి నుంచి తాత్కాలికగా మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసినదే. అలానే వైద్య కళాశాలు మాత్రం పని చేస్తాయని ప్రభుత్వం తెలియజేసింది. 10వ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version