ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. ఈసారి బెంచీ ఒక్కరే

వచ్చే నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ దృష్ట్యా భౌతిక దూరం పాటింపులో భాగంగా ఈసారి బెంచీకి ఒక విద్యార్థినే కూర్చోబెట్టడంతో గత ఏడాదితో పోలిస్తే పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే విద్యార్థులు పరీక్షలు రాయనుండంతో అందుకు తగినట్లు కేంద్రాలను ఎంపిక చేశారు. ఒకరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, రెండో రోజు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలతోపాటు శివారుల్లో ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.