Budget 2024 : నో ట్యాక్స్ లిమిట్ రూ.8లక్షలకు పెంపు..!

-

రానున్న కేంద్ర బడ్జెట్ 2024 పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01 పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నది. మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్ కి ఉన్నంత అంచనాలు ఈసారి బడ్జెట్ పై ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్ లో ఉండేలాంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్ లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్సుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87 ఏ కింద వ్యక్తి గత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని.. దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ.లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలుపుకొని సరళీకృత సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ ని బడ్జెట్ లో ప్రకటించవచ్చని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిటీ చైర్ పర్సన్ వివేక్ జలాన్ అంచనా వేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version