రీల్స్‌ చేయండి.. అవార్డులు పొందండి.. తెలంగాణ అటవీ శాఖ బంపర్ ఆఫర్

-

మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారా..? వీడియోలు.. రీల్స్ చేస్తూ జనాలను ఎంటర్​టైన్ చేస్తుంటారా..? అయితే మీకో బంపర్ ఆఫర్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ వీడియోలు, రీల్స్ చేసే అలవాటు ఉన్న వారి కోసం తెలంగాణ సర్కార్ ఓ క్రేజీ ప్రోగ్రామ్ తీసుకువచ్చింది. రీల్స్ చేసే అలవాటు ఉంటే.. వెంటనే చేసేయండి.. అవార్డులు పొందండి అంటోంది తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ.

హరితహారం, పచ్చదనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ రీల్స్, వీడియోస్ చేసి పంపితే వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తామని రాష్ట్ర అటవీశాఖ తెలిపింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19వ తేదీన హరితోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా పచ్చదనం ప్రాముఖ్యత, హరితహారాన్ని మరింతగా ప్రోత్సహించడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నిమిషం నిడివి ఉండేలా రీల్స్, వీడియోస్‌ చేసి tkhh2023@gmail.comకు పంపాలని అటవీశాఖ సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version