రూ.48 లక్షల కోట్లతో కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఓట్ ఆన్ అకౌంట్ పద్దును తీసుకొచ్చింది కేంద్ర సర్కార్. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పరిమాణం రూ. 47.66 లక్షల కోట్లు. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు సమకూర్చుకోనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపుల వివరాలు వెల్లడించారు.

రక్షణశాఖకు రూ 6.2 లక్షల కోట్లు కేటాయించగా.. రైల్వేశాఖకు రూ.2.55 లక్షల కోట్లు, హోంశాఖకు రూ. 2.03 లక్షల కోట్లు, వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 1.77లక్షల కోట్లు, ఉపరితల రవాణా, జాతీయ రహదారులు- రూ.2.78 లక్షల కోట్లు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.2.13 లక్షల కోట్లు, రసాయనాలు, ఎరువుల కోసం రూ. 1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్‌ రంగానికి రూ.1.37 లక్షల కోట్లు కేటాయింపులు జరిపారు.

బడ్జెట్‌లో వివిధ కేంద్ర పథకాలకు కేటాయింపులు

  • గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేల కోట్లు కేటాయింపు
  • ఆయుష్మాన్‌ భారత్ పథకానికి రూ.7,500 కోట్లు కేటాయింపు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200 కోట్లు కేటాయింపు
  • సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకోవ్యవస్థల తయారీకి రూ.6,903 కోట్లు
  • సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8,500 కోట్లు కేటాయింపు
  • గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ.600 కోట్లు కేటాయింపు

Read more RELATED
Recommended to you

Exit mobile version