అరె ఏంట్రా ఇది..సైకిలా..షేర్ ఆటోనా..

ప్రతి రోజు ఎంతో మంది పుడుతున్నారు.. ఎంతో మంది చనిపొతున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటింది. ఈ సందర్భంగా పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది. ఓ ఒకే సైకిల్‌పై 9 మంది పిల్లలను తీసుకువెళుతున్నాడు..ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను జైకీ యాదవ్ ట్వీట్ చేశారు. ఆ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లో వీడియో వైరల్ అవ్వడం విశేషం..

ఈ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్‌పై తొమ్మిది మంది పిల్లలను ఎక్కించుకుని వెళుతుండటం కనిపించింది. ముగ్గురు పిల్లలు సైకిల్‌ వెనుక కూర్చోగా, వారిపై ఒకరు కూర్చున్నారు. ఇక ఇద్దరు పిల్లలు ముందు భాగంలో కూర్చోగా మరొకరు ఏకంగా వీల్ టాప్‌పై కూర్చున్నారు. సైకిల్ తొక్కుతున్న వ్యక్తి ఇద్దరు పిల్లలను తన భుజాలపై ఎక్కించుకున్నాడు. జైకీ యాదవ్ అనే యూజర్ ట్విట్టర్‌ లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.5 లక్షల మంది వీక్షించారు. ఈ క్లిప్‌ను చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందించారు..

ఒక్కొక్కరూ ఒక్కో విధమైన కామెంట్లు చేస్తున్నారు.ఇంత మంది పిల్లలా అంటూ.. ఓ యూజర్ కామెంట్‌ చేయగా, బాధ్యతగా మెలగండి.. వారిలో అవగాహన పెంచే బాధ్యత పాలకులదేనని మరో యూజర్ కామెంట్ సెక్షన్‌లో రాసుకొచ్చారు. ఇది ఇండియన్ వీడియో కాదని కొందరు అంటుండగా, చాలా మంది ఆఫ్రికాకు చెందినది అంటున్నారు..అయితే ఈ వీడియో మాత్రం ఎక్కడిది అన్న విషయం మాత్రం తెలియలేదు.. కానీ బాగా వైరల్ అవుతుంది.. ఏది ఏమైనా జనాభా పెరిగితే అన్నీ వనరులు సరిపోక తీవ్ర సంక్షొబాన్ని ఎదుర్క్కొవాలి.. జనాభా నియంత్రణ కూడా ముఖ్యమే..ఆ వీడియోపై మీరు ఓ లుక్ వేసుకోండి.