ట్రాక్టర్‌ తోలుకుంటూ మండపానికి వచ్చిన వధువు..! షాక్‌లో వరుడి కుటుంబం

-

ఇంతకు ముందు పెళ్లంటే.. అమ్మాయిలు తెగ భయపడిపోయే వాళ్లు.. పెళ్లి కూతురు దించిన తల ఎత్తకుండా..మనసు లోపల వంద టన్నుల భయం, భాదను భరిస్తూ..పూజిరి చెప్పింది చేస్తూ ఉండేది. కానీ ఇప్పడు కాలం మారింది. పెళ్లిల్లో పెళ్లికూతుర్లే స్వయంగా డ్యాన్సులు వేస్తున్నారు. ఆడిపాడి అలరిస్తున్నారు. అయితే..ఇదంతా ఒక ఎత్తు అయితే.. వధువు ఎంట్రీ మరొ ఎత్తు. ఆ ఈవెంట్ ప్లానర్‌ ఐడియాలను బట్టి వధువు, వరడు ఎంట్రీ ఇస్తున్నారు.

ఒక్కోసారి ఇవి కూడా ప్లాప్‌ అయ్యి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయనుకోండి..! సాధారణంగా పెళ్లికూతురు ఎంట్రీ.. అంటే.. పల్లకిలోనూ, బుట్టలోనే ఉంటుంది. తాజాగా అయితే.. పడవలో కూడా ఓ వధువు ఎంట్రీ ఇచ్చింది. కానీ మనం చెప్పుకోబోయేది.. మాస్‌ ఎంట్రీ.. ఏకంగా ట్రాక్టర్ పై తనే స్వయంగా ట్రాక్టర్‌ తోలుకుంటూ.. పక్కన సోదరులను కుర్చోపెట్టుకుని మండపానికి వచ్చింది..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఆసక్తికర ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెతుల్‌ జిల్లా జావ్రా గ్రామానికి చెందిన భారతి తద్గే అనే యువతికి సమీప గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం సాయంత్రం ఈ వివాహం జరగ్గా.. మండపానికి వధువు ఆసక్తికర రీతిలో ఎంట్రీ ఇచ్చింది.. తన సోదరులిద్దరినీ ఇరువైపులా కూర్చొ పెట్టుకుని…వధువు భారతి ట్రాక్టర్‌ నడుపుకొంటూ వివాహ వేదిక వద్దకు చేరుకొంది.

నళ్ల కళ్లజోడు ధరించి ట్రెండీగా కనిపించింది. వధువు ట్రాక్టర్‌పై ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. పల్లకిలో రావడం కామన్‌ అని.. కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేసినట్లు చెప్పుకొచ్చింది వధువు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version