అరటిపండ్లు ఎందుకు వంకరగా ఉంటాయి.. కారణం అదేనా..?

-

సాధారణంగా ఏ పండు అయినా గుండ్రంగానే ఉంటుంది..కాకపోతే సైజుల్లో తేడా ఉంటుంది.. ద్రాక్ష అయితే చిన్నగా ఉంటుంది.. బత్తాయి, ఆపిల్‌, ఆరెంజ్‌, జామ లాంటివి అయితే గుండ్రంగా ఉంటాయి.. మరి అరటిపండు ఎందుకు వంకరగా ఉంటుంది. ఇది ఎందుకు వంగిపోయి ఉంటుంది.. మీకు కూడా ఈ డౌట్‌ ఎప్పుడైనా వచ్చిందా..? అయితే తెలుసుకుందాం పదండి..!!
అరటిపండ్లు చెట్లపై పెరుగుతాయని మనందరికీ తెలుసు. మొదట చెట్టుకి అరటి పువ్వు వస్తుంది. తర్వాత ఆ పువ్వుల రేకల కింద చిన్న అరటి పండ్ల వరుసలు పెరగడం ప్రారంభమవుతుంది. వాటిలో తేనెను కూడా తీస్తారు.. పూల తెనే చాలా మంచిది.. ఆ పిలకలు.. పెద్దవి అవుతూ.. అరటి గెల తయారవుతుంది. ఇలా అరటి పండు పెరిగే సమయంలో.. నెగెటివ్ జియోట్రోపిజం అనే ప్రక్రియ జరుగుతుంది.

నెగెటివ్ జియోట్రోపిజం అంటే..

సాధారణంగా భూమి దేన్నైనా తనవైపు లాక్కుంటూ ఉంటుంది. దాన్నే మనం ఆకర్షణ అంటాం. అరటి పండ్లు ఈ గ్రావిటీకి లొంగవు. అవి భూమికి రివర్సులో.. ఆకాశంవైపు తిరుగుతాయి. సూర్యకాంతి ఎటు ఉంటే అటు పెరుగుతాయట.. సూర్యరశ్మిని గ్రహించేందుకు అరటిపండ్లు పైకి పెరిగేందుకు ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో అవి వంకర అవుతాయి. పండు పూర్తిగా తయారయ్యేసరికి.. కొంత వంకరగా ఉండటం మనం చూస్తాం.
అరటి చెట్ల ఆకులు పెద్దగా ఉంటాయి. వాటి కింద పెరిగే అరటి గెలకు సూర్యకాంతి అంత త్వరగా రాదు. ఆ కాంతి కోసం అరటికాయలు.. పైకి పెరుగుతాయి. ఇండియాలో అరటి చెట్టును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇందులో ప్రతీదీ మనకు బాగా ఉపయోగపడుతుంది.
ఆకుల్లో భోజనం చేస్తారు… అరటిపండ్లను ఇష్టదైవానికి నైవేద్యంగా పెడతాం. అలాగే అరటి కాండాన్ని ఆవులకు ఆహారంగా పెడతారు.
అరటి కాండం మధ్యలో మొవ్వ ఉంటుంది. ఇది తెల్లగా, తియ్యగా ఉంటుంది. పల్లెల్లో ఈ మొవ్వను సైతం తింటారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే.
పొద్దు తిరుగుడు పువ్వు కూడా అరటి లాంటిదే. ఈ పువ్వులు సూర్యుడు ఎటు ఉంటే అటువైపు తిరుగుతూ ఉంటాయి. ఈ విషయం అయితే మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది.
అరటి, సన్ ఫ్లవర్ మాత్రమే కాదు.. ఈ భూమిపై చాలా చెట్లు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాయి. సూర్యకాంతి కోసం అవన్నీ ఆకాశంవైపే పెరుగుతాయి. భూమివైపు పెరగవు. సో.. ఇది రీజన్‌ అనమాట.. అందుకే అరటిపండ్లు వంకరగా ఉంటాయి..!!

Read more RELATED
Recommended to you

Latest news