భోజనం చేసాక పండ్లు తింటున్నారా..? అయితే తప్పక ఇవి తెలుసుకోండి..!

-

చాలా మంది ప్రతి రోజూ పండ్లను తీసుకుంటూ ఉంటారు. భోజనం తర్వాత కూడా చాలా మంది పండ్లను తీసుకుంటూ ఉంటారు. పండ్లని తీసుకునేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే పండ్లను తీసుకునేటప్పుడు మాత్రం కొన్ని తప్పుల్ని అస్సలు చేయొద్దు. ఆరోగ్య నిపుణులు ఈ విషయాలని చెబుతున్నారు. మరి ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

కమలా పండ్లు ని తీసుకునేటప్పుడు ఆహారం తినడానికి గంట ముందు లేదంటే ఆహారం తిన్న తర్వాత ఒక గంట ఆగి తినడం మంచిది. మామిడిపండ్ల లో షుగర్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఇది పెంచుతుంది. డయాబెటిక్ పేషెంట్లు ఆహారం తిన్న వెంటనే తీసుకోవడం మంచిది కాదు. మామిడి పండ్లు ఆహారం తినడానికి గంట ముందు తీసుకోవచ్చు. లేదంటే తిన్నాక గంటసేపు ఆగి తినొచ్చు.

అరటి పండ్లను రాత్రిపూట అసలు తీసుకోకూడదు. రాత్రిపూట అరటి పండ్లు తీసుకుంటే నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్ర పట్టదు. పుచ్చకాయని తీసుకోవడానికి మంచి సమయం మధ్యాహ్నం. రాత్రిపూట పుచ్చకాయని తీసుకోవద్దు. రాత్రి లేవాల్సి వస్తుంది. ద్రాక్ష పండ్లను కూడా తినడానికి గంట ముందు లేదా తిన్న తర్వాత గంట ఆగి తినడం మంచిది. బత్తాయి పండు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. బత్తాయి ఎనర్జీని ఇస్తుంది. డిహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది. మధ్యాహ్నం పూట తినడం కూడా మంచిదే.

Read more RELATED
Recommended to you

Latest news